/rtv/media/media_files/2025/01/16/7sBSZJ6O302MZ5El11R2.jpg)
priyanka
Priyanka Chopra : అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగావేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది సంపన్నుల గృహాలు మంటల్లో బూడిదయ్యాయి. లాస్ ఏంజెలెస్ లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నివాసముంటున్నవిషయం తెలిసిందే. తాజాగా ఆమె దీని పై ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Telangana: వణుకుతున్న తెలంగాణ...మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!
ఈ విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్న ప్రియాంక అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఙతలు చెప్పారు.''నేను ఎంతో బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్నికాపాడిన వారికి రుణపడి ఉంటాను. నా స్నేహితులు , సహచరులు ఎంతో మంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు.
Also Read: Planet Parade: ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్ లోకి 7 గ్రహాలు!
మీరే నిజమైన హీరోలు..
ఈ మంటల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. మీరే నిజమైన హీరోలు అని పోస్ట్ పెట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో సమష్టి కృషి అవసరమని ప్రియాంక అన్నారు. వారం రోజుల నుంచి ఎంతో మంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. సర్వస్వం కోల్పోయిన వారికి విరాళాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు అమెరికా (America) చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొడి వాతావరణం అగ్నికి ఆజ్యం పోస్తుండగా..కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో అంత విస్తీర్ణాన్ని దావాగ్ని చుట్టుముట్టి బూడిదగా మార్చేస్తోంది.
వారం దాటింది...కానీ లాస్ ఏంజెలెస్ (Los Angeles) కార్చిచ్చు దాహం మాత్రం ఇంకా చల్లారలేదు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలను ఆపడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. రాత్రి, పగలనక పని చేస్తున్నారు. దావానలం వ్యాపించకుండా ఉండడానికి నీళ్తో పాటూ పింక్ కలర్ ద్రాణాన్ని చల్లుతున్నారు. అయినా కూడా ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఎనిమిది రోజులు అయింది కానీ ఇంకా అవి చల్లారలేదు. మరవైపు దీని కారణం 25 మంది చనిపోయారు
Also Read: Trump: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్..కారణమేంటి
Also Read: Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే