Pollution: పంజాబ్‌లో కాలుష్యం.. 18 లక్షల మంది ఆస్పత్రిపాలు

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ పాఠశాలలు, పార్కులు, మ్యూజియాలు కూడా మూసేశారు.

pak pol
New Update

ప్రస్తుతం వివిధ దేశాల్లో కాలుష్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో కూడా కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ కాలుష్యం రోజురోజుకు పెరగడంతో మరికొన్నిరోజుల పాటు పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. 

Also Read :  కొడంగల్‌లో అసలేం జరుగుతోంది.. ఫార్మాసిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

30 రోజుల్లో 18 లక్షలకు పైగా ఆస్పత్రిపాలు

పంజాబ్‌ ప్రావిన్సులో ప్రస్తుతం 12.7 కోట్ల జనాభా ఉంది. గత కొన్ని రోజుల నుంచి అక్కడ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య ప్రభావిత జిల్లాల్లో అస్వస్థకు గురయ్యేవారి సంఖ్య పెరిగింది. గత 30 రోజుల్లో 18 లక్షల మందికి పైగా ఆస్పత్రులు, అలాగే ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయించారు. వీళ్లలో ఎక్కవమంది శ్వాసకోస సంబంధిత వ్యాధులతో అలాగే కళ్లమంట వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.  

Also Read: మణిపుర్‌లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్‌

బయటకి రావొద్దు

పంజాబ్‌ ప్రావిన్సులో మొత్తం 17 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. కాలుష్య ప్రభావానికి అక్కడి పాఠాశలలతో సహా పార్కులు, మ్యూజియాలను కూడా మూసివేశారు. అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని.. లేకపోతే ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. కాలుష్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు. 

ఇదిలాఉండగా.. పంజాబ్‌ ప్రావిన్సులో దాదాపు 1.1కోట్ల మంది చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ఐక్యరాజ్యసమితి చిన్నారుల విభాగం కూడా వెల్లడించింది. అయితే పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడంతో ఢిల్లీలో కూడా ప్రతీ సంవత్సరం శీతాకాలం ప్రారంభంలో కాలుష్యం పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ప్రభావం పాకిస్థాన్‌లో పంజాబ్‌ ప్రావిన్స్‌పై కూడా చూపించడం ఆందోళన కలిగిస్తోంది.  

Also Read :  ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!

Also  Read: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

#telugu-news #national-news #air-pollution #punjab #pakisthan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe