Missing Case: మణిపుర్‌లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్‌

మణిపూర్‌లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు

New Update
manipur women

Childrens And Women's Missing Case In Manipur

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. సోమవారం జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోవండంతో 10 మంది కుకీ మిలిటెంట్లు హతమయ్యారు. అయితే సోమవారం నుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం కనిపించకుండా పోయిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల కోసం బలగాలు గాలిస్తున్నాయని మణిపుర్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

సోమవారం జరిగిన ఈ కాల్పుల్లో 10 మంది కుకీ మిలిటెంట్లు హతమవ్వగా.. మరో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌పై సోమవారం మధ్యాహ్నం కొందరు మిలిటెంట్లు దాడులు చేశారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న జకురాడోర్‌ కరోంగ్‌ అనే గ్రామం వైపు దూసుకెళ్లి నానా బీభత్సం చేశారు. చాలా దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు- మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది సాయుధులు హతమైనట్లు అధికారులు తెలిపారు. 

Also Read: మిస్‌ టీన్ యూనివర్స్ కిరీటం సాధించిన భారతీయ యువతి

గత ఏడాది మణిపుర్‌లో మెయిటీలు, కూకీ జాతుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇద్దరు మహిళలను నగ్నంగా తీసుకెళ్లి అత్యాచారం చేసిన దుమారం రేపింది. ఇప్పటికీ మణిపుర్‌లో మెయిటీలు, కూకీ జాతుల మధ్య సమస్యలకు పరిష్కారం దొరకలేదు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో కొద్దినెలలుగా అక్కడ ప్రశాంత వాతవరణం కనిపిస్తోంది. కానీ మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.  

Also Read: హైదరాబాద్, వైజాగ్‌లో ఉగ్రవాదులు.. దాడులు చేసేందుకు భారీ ప్లాన్

Also read:  మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు