/rtv/media/media_files/2025/02/13/EOfEEb9j5uBTFZu5iOX1.jpg)
Ranveer allahbadia
యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. చాలామంది అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించే ఛాన్స్ కనిపిస్తోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఇప్పటికే ఈ షో నిర్వహించిన సభ్యులపై నమోదు చేశారు. రణవీర్ కూడా పోలీసులు ముందు హాజరుకావాల్సి ఉంది. ఇంటి దగ్గరే తన వాంగ్మూలం రికార్డు చేయాలని రణవీర్ పోలీసులను కోరాడు. కానీ వాళ్లు దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. విచారణకు రాకపోవడంతో అతడికి రెండోసారి సమన్లు జారీ అయ్యాయి. అస్సాంలో కూడా వీళ్లపై కేసు నమోదైంది.
Also Read: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్.. ఎందుకంటే ?
ఇండియా గాట్ టాలెంట్ షో లో ఓ యువతిని రణవీర్ తన తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రశ్న అడగటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పటికే అతడు క్షమాపణలు చెప్పాడు. '' నేను చేసిన వ్యాఖ్యల్లో హాస్యం లేదు. ఇలా మాట్లాడి నా ప్రచారం తెచ్చుకోవాలని నేను అనుకున్నానని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యలను నేను సమర్థించుకోవడం లేదు. నన్ను క్షమించండి అంటూ పోస్టు పెట్టాడు.
Also Read: అమెరికాలో కోడిగుడ్ల కొరత..డజను గుడ్ల ధర ఎంతంటే?