Manchu Manoj : నన్ను తొక్కాలని, నలపాలని చూస్తారా? మీ వల్ల కాదు -మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

మంచు ఫ్యామిలీ లో నెలకొన్న వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప..ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. తాజాగా..నన్ను ఎంతోమంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరంటూ మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Vishnu Manchu_ Manchu Manoj

Vishnu Manchu_ Manchu Manoj

 Manchu Manoj :  మంచు ఫ్యామిలీ లో నెలకొన్న వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప.. ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. తాజాగా.. ఈ అంశంపై మంచు మనోజ్  మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎంతోమంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌. తనను తొక్కాలన్నా, లేపాలన్నా అది అభిమానుల వల్లే అవుతుందని స్పష్టం చేశారు.భరత్‌ హీరోగా పరిచయమవుతున్న జగన్నాథ్‌ సినిమా టీజర్‌ను మంచు మనోజ్‌ ఈరోజు రిలీజ్‌ చేశాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!


అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో జరిగిన ఈ టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో మనోజ్‌ మాట్లాడుతూ.. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మంది తొక్కాలని చూసినా, బురద జల్లాలని చూసినా.. ఆ నాలుగు గోడల మధ్యకు నన్ను రానీయకపోయినా, నన్ను ఏం చేసినా సరే.. ప్రజల గుండెల్లో నుంచి మాత్రం నన్ను తీయలేరు. మీరే నా దేవుళ్లు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్నీ. అంటూ ఎమోషన్‌ అయ్యారు.

 Also Read:  ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్‌!

చెట్టుపేరో, జాతి పేరో చెప్పుకుని మార్కెట్‌లో అమ్ముడుపోవడానికి నేను కాయో, పండో కాదు.. మీ మనోజ్‌ను. మనోజ్‌ను తొక్కుదామని చూస్తారా? నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కాలన్నా, లేపాలన్నా అది అభిమానుల వల్ల మాత్రమే అవుతుంది. ఈ ప్రపంచంలో ఇంకెవరి వల్లా కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మంచి కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగేవరకు దాన్ని వదిలిపెట్టేది లేదు. అది బయటవాళ్లైనా సరే, నా వాళ్లయినా సరే.. న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తాను. నేను విద్యార్థుల కోసం నిలబడ్డాను. నా ప్రాణం ఉన్నంతవరకు నిబలడతాను. ఈ రోజే కాదు, ఎప్పటికీ ఎవరూ నన్ను ఆపలేరు అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. పరోక్షంగా మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న కన్నప్ప సినిమా పై విమర్శలు చేశారు. సినిమా బడ్జెట్‌ ఎంత అనేది ఎవరూ చూడరు. సినిమా బాగుందా..? లేదా అనేది కీలకమని మంచు మనోజ్ వ్యాఖ్యానించారు.  

Also Read: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్‌.. ఎందుకంటే ?

ఇదిలా ఉండగా.. మంచు ఫ్యామిలీ ఆశలన్నీ కన్నప్ప చిత్రంపైనే పెట్టుకున్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన సన్ ఆఫ్ ఇండియా, మోసగాళ్లు చిత్రాలు అనుకున్న రేంజ్‌లో రాణించలేకపోయాయి. దీంతో భారీ బడ్జెట్‌తో అన్ని భాషల ప్రముఖులతో కన్నప్ప చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు నుంచి ప్రభాస్ , మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ వంటి కీలక నటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

మరోవైపు జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌ బాబు కు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. మోహన్‌ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2024 డిసెంబరు 10వ తేదీన జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Also Read : Konda Surekha : నాంపల్లి కోర్టుకు మంత్రి సురేఖ...కోర్టు ఆదేశాలతో...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు