Trump Hand Patch: ట్రంప్ చేతి మీద పెద్దవుతున్న మచ్చ..అసలేమైందంటూ చర్చ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతి మీద మచ్చ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకు ముందు కన్నా అది పెద్దగా కనిపించడం చర్చకు గురి చేస్తోంది. ఆ మచ్చను ట్రంప్ దాచుకోవడం మీద కూడా మాట్లాడుకుంటున్నారు. 

New Update
Trump health

Trump Hand Patch

కొన్ని రోజు క్రితం నుంచీ అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం మీద చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆయన కాలు వాచి ఉండడం, చేతి మీద మచ్చ గురించి చర్చ జరిగింది. దీని గురించి అప్పుడు వైట్ హౌస్ ఏదో చెప్పి కవర్ చేసింది. కాలుకి సమస్య ఉందని ఒప్పుకున్నా..చేతి మీద మచ్చ గురించి మాత్రం అర్ధం పర్ధం లేని సంజాయిషీ ఇచ్చారు వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. కాళ్ళలోని సిరల కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం పేరుకుపోయి ఒత్తిడి పెరుగుతోందని అందుకే కాళ్ళు వాస్తున్నాయని తెలిపారు. వయసు పైబడిన వారిలో ఇది సాధారణంగా కనిపించే లక్షణమేనని తెలిపారు. అయితే దీని వలన ట్రంప్ ఇబ్బంది పడడం లేదని చెప్పారు. అదే సమయంలో చేతి మచ్చ గురించి చెబుతూ ఎక్కువ మందితో కరచాలనం చేస్తారని అందుకే అలా అయిందని అన్నారు. దీనిపై చాలానే మాట్లాడుకున్నారు. అలా అయితే ప్రపంచ నేతలందరికీ అలా అవ్వాలని కూడా కామెంట్ చేశారు. తరువాత వైట్ హౌస్ వైద్యుడు కెప్టెన్ సీన్ బార్బబెల్లా కడా ట్రంప్ అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారని సర్టిఫై చేశారు. దీంతో  తొందరగానే ఆయన ఆరోగ్యం మీద చర్చ కాస్తా సద్దుమణిగింది. 

మళ్ళీ పెద్దగా కనిపిస్తున్న మచ్చ..

కానీ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ చేతి మచ్చ మీద అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తాజాగా పాపుల్స్ హౌస్ మ్యూజియం సందర్శించినప్పుడు, ఓవల్ ఆఫీస్ లో వరల్డ్ కప్ ఈవెంట్ కు అటెండ్ అయినప్పుడు ట్రంప్ చేతి మీద మచ్చ చాలా పెద్దగా కనిపించింది. దాన్ని ఆయన దాచుకోవాలని చాలానే ప్రయత్నించారు కానీ..లేచి నిలబడినప్పుడు స్పష్టంగా కనిపించింది. పైగా మచ్చ కనించకుండా ఉండడానికి ట్రంప్ దాని మీద ఫౌండేషన్ మేకప్ వేసుకున్నారు. ఇది కూడా ప్రత్యేకంగా అందరికీ కనిపించింది. దీంతో మళ్ళీ అందరూ ట్రంప్ ఆరోగ్యం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆయనకు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లీవిట్ మళ్ళీ అదే వ్యాఖ్యలు చేశారు.  ట్రంప్ ప్రజల మనిషని..మిగతా అధ్యక్షుల కంటే ఎక్కువగా అందరితో షేక్ హ్యాండ్ చేస్తారని అందుకే చేతి మచ్చ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. పైగా ట్రంప్ నిబద్ధత దాని ద్వారా తెలుస్తోందంటూ కవర్ చేసుకొచ్చారు. 

ట్రంప్ చేతి మీద మచ్చ కనిపించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు ఫిబ్రవరిలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను కలిసినప్పుడు, జూలై చివరలో స్కాట్లాండ్‌లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, UK ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో జరిగిన సమావేశాల్లో ఈ ప్యాచ్ కనిపించింది. 

Also Read: Good News: ఫ్యాన్స్ పండుగ చేసుకోండి..2027 వరల్డ్ కప్ వరకు విరాట్ , రోహిత్ ఆడ్డం పక్కా

Advertisment
తాజా కథనాలు