Bangladesh Ex PM: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి సీరియస్.. మోదీ కీలక ప్రకటన!

బంగ్లాదేశ్ కు మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఖాలిదా జియా ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేషన్ పై ఉన్నారు. జియా ఆరోగ్యంపై భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

New Update
zia

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్య విషయంలో భారతదేశం అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. బంగ్లాదేశ్‌ ప్రజలకు విశేష సేవలు అందించిన ఆమె సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Also Read :  నా భార్యకు భారతీయ మూలాలు, కోడుకు పేరు అశోక్.. ఎలాన్ మస్క్

వెంటిలేట్ పై జియా..

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ అయిన 80 ఏళ్ల ఖలీదా జియా నవంబర్ 23న ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారడంతో కరోనరీ కేర్‌ యూనిట్‌కు తరలించారు. ప్రస్తుతం జియా వెంటిలేషన్ మీద ఉన్నారు. జియా పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను వెంటిలేషన్ పై ఉంచామని బిఎన్‌పి ఉపాధ్యక్షుడు న్యాయవాది అహ్మద్ అజామ్ ఖాన్ చెప్పారు. ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదని..దేశం మొత్తం ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేమి ఆయన అన్నారు. ఖలీదీ జియా ప్రస్తుతం ఢాకాలోనిఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక, అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దేశం మొత్తం జియా కోలుకోవాలని కోరుకుంటున్నారనిBNP ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ అన్నారు. డాక్టర్లు అందరూ ఆమె చికిత్సలో నిమగ్నమై ఉన్నారని...వారు శాయశ్తులా ప్రయత్నిస్తున్నారని అలంగీర్ తెలిపారు.

Also Read: Venezuela: ఆ హామీ ఇస్తే..దేశాన్ని వీడేందుకు సిద్ధం..వెనిజులా అధ్యక్షుడు మదురో

Advertisment
తాజా కథనాలు