/rtv/media/media_files/2025/09/06/pm-modi-and-trump-likely-to-meet-on-the-sidelines-of-asean-summit-on-oct-26-2025-09-06-21-49-25.jpg)
PM Modi and Trump Likely to Meet on the Sidelines of ASEAN Summit on Oct 26
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనిపై ట్రంప్ కూడా భారత్‌ను కోల్పోతున్నామనే ఓ పోస్టు చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత మోదీని గొప్ప ప్రధాని అంటూ కూడా పొగిడారు. ఆయన తనకు మంచి స్నేహితుడు అని, భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ట్రంప్.. భారత్‌పై 50 శాతం సుంకాలు ఎప్పుడు ఎత్తివేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇరుదేశాధినేతలు సమావేశం అయితే తప్ప ఇది జరిగే అవకాశమే లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే మోదీ, ట్రంప్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే ఆర్థిక సాయం.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్‌లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 'అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ కంట్రీస్' (ASEAN) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు మోదీ కూడా సాధారణంగా ASEAN సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నారు. దీంతో ఈ ఏడాది జరగనున్న ఈ సదస్సుకు కూడా ఆయన హాజరయ్యే ఛాన్స్ ఉంది.
Also Read: మరో రెండు నెలలో భారత్ క్షమాపణలు చెబుతుంది..యూఎస్ కామర్స్ సెక్రటరీ నోటి దురద
అక్టోబర్ 26, 27 తేదీల్లో జరగనున్నట్లు ఈ ASEAN సదస్సులో అక్టోబర్ 26న ప్రధాని మోదీ, ట్రంప్ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ కంట్రీస్ (ASEAN) అనేది ఆగ్నేసియా దేశాల సంఘం. ఈ సదస్సు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ మీటింగ్‌లో ఆగ్నేసియా దేశాధినేతలు పాల్గొంటారు. ఆర్థిక, భద్రత, రాజకీయ అలాగే సాంస్కృతిక అంశాల గురించి చర్చలు జరుపుతారు.
ఇదిలాఉండగా ఇటీవల ట్రంప్ భారత్‌పై 25 శాతం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 25 శాతం సుంకాలు విధించి 50 శాతానికి పెంచారు. ఓవైపు యుద్ధంలో ప్రజలు చనిపోతుంటే.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూ ప్రయోజనం పొందుతోందని ట్రంప్ ఆరోపించారు. అందుకే తాను టారిఫ్‌లు పెంచినట్లు పేర్కొన్నారు. అంతేకాదు ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి దక్కించుకునేందుకు ఆరాటపడుతున్నారు. కానీ భారత్ ఆయన్ని నామినేట్ చేయకపోవడంతో చిరాకుతో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ కోణంలో కూడా ట్రంప్ టారిఫ్‌లు పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: భారత్ సుంకాలపై ట్రంప్ పశ్చాత్తాపం..చమురు కొనుగోలు వల్లనే..
ఇటీవల రష్యా, చైనా, భారత్ షాంఘై సహకార సదస్సు(SCO)లో సమావేశమైన సంగతి తెలిసిందే. పుతిన్, జిన్‌పింగ్, మోదీని ఒకే వేదికపై చూసిన ట్రంప్ షాక్ అయ్యారు. ఆ తర్వాత చైనాను విమర్శిస్తూ ఓ కీలక పోస్టు చేశారు. చైనా చీకట్లోకి వెళ్లిన భారత్, రష్యాను తాము కోల్పోయామంటూ తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. మరోవైపు భారత్, రష్యా సంబంధాలు కూడా మరింత బలోపేతమవుతున్నాయి. ట్రంప్ కూడా భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన అక్టోబర్‌లో జరగనున్న ASEAN సదస్సులో మోదీతో భేటీ అయ్యి టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గుతారా ? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది.