Trump Tariffs: మరో రెండు నెలలో భారత్ క్షమాపణలు చెబుతుంది..యూఎస్ కామర్స్ సెక్రటరీ నోటి దురద

భారత్ సుంకాలపై అమెరికా అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇండియా రెండు నెలల్లో నే అమెరికాకు క్షమాపణలు చెబుతుందని..వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని..యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ కామెంట్స్ చేశారు. 

New Update
Howard Lutnick

Howard Lutnick

భారత్ ను కోల్పోయినట్లు అనిపిస్తోంది. చైనా చేతిలో రష్యా, ఇండియాలను కోల్పోయామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆ మూడు దేశాలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్రూత్ లో పోస్ట్ కూడా పెట్టారు. తరువాత మీడియా సమావేశంలో మళ్ళీ అదే చెప్పారు. అయితే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంలో మాత్రం తాను నిరాశ చెందానని చెప్పారు. అయితే మరోవైపు అమెరికా అధికారులు మాత్రం నోటికి వచ్చినట్టు ప్రేలాపన పేలుతున్నారు. 

భారత్ మా దారికి రావాల్సిందే..

తాజా యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ మాట్లాడుతూ..ఒకటి రెండు నెలలో భారత్ అమెరికాకు క్షమాపణలు చెబుతుందని లుట్కిన్ అన్నారు. వాళ్ళు అమెరికాను క్షమించమని అడిగి..ట్రంప్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారని అన్నారు. అలా చేయకపోతే ఆ దేశం 50 శాతం సుంకాలను భరించాల్సి వస్తుందని బెదిరించారు. అతి పెద్ద క్లయింట్ తో పోరాటం కొన్నిసార్లు గొప్పగా అనిపిస్తుందని లుట్కిన్ చెప్పుకొచ్చారు. అయితే ఎక్కువ రోజులు కొనసాగదు చివరకు అమెరికా ఒప్పందాలను ఒప్పుకోవాల్సిందేనని అన్నారు. భారత్‌ తన మార్కెట్‌ తలుపులను మూసేయడం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, బ్రిక్స్‌లో భాగస్వామిగా కొనసాగడం ఆపాలనుకోవడం లేదు.

రష్యా, చైనాలతో...భారత్ మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని..కానీ అమెరికా డాలర్ గానీ, యూఎస్ కు గానీ మద్దతు తెలపాల్సిందేనని హోవార్డ్ లుట్కిన్ అన్నారు. అలా లేకపోతే మాత్రం 50 శాతం టారిఫ్ లను భరించాల్సిందననే స్పష్టం చేశారు. భారత్ వైఖరి ఎన్నాళ్ళ పాటూ ఇలకే కొనసాగుతుందో చూద్దాం అని అన్నారు. రష్యా తన వద్ద ఉన్న చమురును చాలా చౌకగా అమ్మేస్తోంది. అందుకోసం వాణిజ్య భాగస్వాములను వెతుకుతోందని, దాన్ని భారత్‌ ఉపయోగించుకుంటోంటింది.  దీంతో భారత్ భారీగా లాభాలను సాధిస్తోందని లుట్కిన్ ఆరోపించారు. 

ఒకవైపు భారత్, రష్యా లను కోల్పోయానని చెబుతూనే తన తప్పేమీ లేదని బుకాయిస్తున్నారు ట్రంప్. భారత్ కావాలనే అమెరికాను దూరం చేసుకుంది అన్నట్టు మాట్లాడారు. చైనా చేతిలోకి భారత్ వెళ్ళిపోయేలా చేయడంలో తప్పెవరిది అన్న ప్రశ్నకు సమాధానంగా..  ఎవరిదీ లేదు. మేమేమీ కావాలని అలా చేయలేదు. భారతదేశం రష్యా నుండి ఇంత ఎక్కువ చమురు కొనుగోలు చేయడం చూసి నేను చాలా నిరాశ చెందాను.  అదే విషయాన్ని భారత్ కు చెప్పాము . కానీ వారు పట్టించుకోలేదు. అందుకే సుంకాలు విధించాల్పి వచ్చిందని చెప్పుకొచ్చారు. అవును నిజమే ఆ దేశంపై చాలా ఎక్కువ సుంకమే విధించానని అన్నారు. నిజానికి భారత ప్రధాని మోదీతో నేను చాలా బాగా కలిసిపోయాను. రెండు నెలల క్రితం ఆయన వచ్చినప్పుడు కూడా బాగా మాట్లాడుకున్నాము అని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు