/rtv/media/media_files/2025/09/06/khalistani-extremists-receive-financial-support-from-inside-canada-2025-09-06-20-43-17.jpg)
Khalistani extremists receive financial support from inside Canada
ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడాలో భారత వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థానీ ఉగ్రసంస్థలకు కెనాడా నుంచే నిధులు అందినట్లు బయటపడింది. 'టెర్రర్ ఫైనాన్సింగ్'పై కెనడా సర్కా్ర్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ దేశం నుంచే ఆ ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయం వెళ్లినట్లు పేర్కొంది. వాటిని బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్‌గా పేర్కొంది.
Also Read: మరో రెండు నెలలో భారత్ క్షమాపణలు చెబుతోంది..యూఎస్ కామర్స్ సెక్రటరీ నోటి దురద
''2025 అసెస్‌మెంట్ ఆఫ్ మనీలాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్ ఇన్ కెనడా'' అనే పేరుతో రూపొందించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించారు. '' రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం (PMVE) కేటగిరిలో ఉన్నటువంటి హమాస్, హెజ్‌బొల్లా, ఖలిస్థానీ లాంటి ఉగ్రసంస్థలకు కెనడా నుంచి నిధులు వస్తున్నాయి. దీన్ని అధికారులు గుర్తించారు. భారత్‌లో ఉన్న పంజాబ్‌లో స్వతంత్ర దేశ కోసం సపోర్ట్ చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రసంస్థలు కెనడాతో చాలా దేశాల్లో నిధులు సేకరిస్తున్నాయని తెలుస్తోంది.
Also Read: పాకిస్తాన్ కరాచీలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు.. గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్న వీధులు!
గతంలో ఖలిస్థానీ ఉగ్రమూకలకు కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ నెట్‌వర్క్ ఉండేది. ప్రస్తుతం మాత్రం ఖలిస్థానీలకు సపోర్ట్ చేసే వ్యక్తులే ఆర్థిక సాయం చేస్తున్నారు. హమాస్, హెజ్‌బొల్లాలు తమ నిధుల కోసం ఛారిటబుల్ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయి. ఖలిస్థానీ ఉగ్రమూకలు కూడా స్వచ్ఛంద సంస్థలతో సహా తమ నెట్‌వర్క్ ద్వారా నిధుల సేకరణ, తరలింపును మొదలుపెట్టాయి. కానీ ఈ మార్గాల ద్వారా వారికి తక్కువగానే నగదు సమకూరుతోంది. ఇక మాదకద్రవ్యాల అక్రమ రవాణా కూడా కెనడాకు అతిపెద్ద మనీలాండరింగ్ ముప్పుగా ఉందని'' ఆ రిపోర్ట్ వెల్లడించింది.
Also read: ఛీఛీ - కామ ప్రిన్సిపాల్.. 11 ఏళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్స్ తాకి ముద్దు పెట్టుకుంటూ
మరోవైపు తమ దేశం నుంచే ఖలిస్థానీ ఉగ్రవాదులు కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని కూడా ఈ ఏడాది జూన్‌లో కెనడా అంగీకరించింది. దీంతో ఖలిస్థానీ ఉగ్రవాదులకు అక్కడి నుంచి నిధులు సమకూరడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఖలిస్థానీలు పలు హిందూ ఆలయాల్లోని గోడలపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం కెనడా మాత్రమే కాదు ఆస్ట్రేలియాలో కూడా ఖలిస్థానీయులు పెరిగిపోయారు. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులు అక్కడ వేడుకలు జరుపుకుంటే వారిని అడ్డుతగిలారు. దీనికి భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Also Read: తాగుబోతు ఫ్రెండ్స్.. జాతరలో కత్తులతో పొడిచి చంపేశారు..!