/rtv/media/media_files/2025/08/04/trump-2025-08-04-21-36-24.jpg)
Trump
ఒకవైపు భారత్, రష్యా లను కోల్పోయానని చెబుతూనే తన తప్పేమీ లేదని బుకాయిస్తున్నారు ట్రంప్. భారత్ కావాలనే అమెరికాను దూరం చేసుకుంది అన్నట్టు మాట్లాడారు. చైనా చేతిలోకి భారత్ వెళ్ళిపోయేలా చేయడంలో తప్పెవరిది అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఎవరిదీ లేదు. మేమేమీ కావాలని అలా చేయలేదు. భారతదేశం రష్యా నుండి ఇంత ఎక్కువ చమురు కొనుగోలు చేయడం చూసి నేను చాలా నిరాశ చెందాను. అదే విషయాన్ని భారత్ కు చెప్పాము . కానీ వారు పట్టించుకోలేదు. అందుకే సుంకాలు విధించాల్పి వచ్చిందని చెప్పుకొచ్చారు. అవును నిజమే ఆ దేశంపై చాలా ఎక్కువ సుంకమే విధించానని అన్నారు. నిజానికి భారత ప్రధాని మోదీతో నేను చాలా బాగా కలిసిపోయాను. రెండు నెలల క్రితం ఆయన వచ్చినప్పుడు కూడా బాగా మాట్లాడుకున్నాము అని ట్రంప్ గుర్తు చేసుకున్నారు.
చైనా చేతిలో భారత్, రష్యా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతోపాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని చెబుతూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో సమావేశమైనప్పటి ఫోటోను కూడా పెట్టారు. భారత్, రష్యా రెండు దేశాలు కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, వారందరికీ సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
Also Read: వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా 10 ఏళ్ల బాలుడికి గుండెపోటు.. తల్లి ఒడిలోనే