/rtv/media/media_files/2025/08/13/perplexity-ceo-arvind-srinivas-made-a-bold-offer-to-buy-google-chrome-2025-08-13-19-54-08.jpg)
Perplexity CEO Arvind Srinivas made a bold offer to buy Google Chrome
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ కంపెనీ పర్‌ప్లెక్సిటీ సాంకేతిక రంగంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న వెబ్‌బ్రౌజర్ గూగూల్ క్రోమ్(Google Chrome) నే కొనేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం గూగుల్‌కు మొత్తం 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే అంత భారీ సొమ్ము పర్‌ప్లెక్సిటీ కంపెనీ విలువ కన్నా ఎక్కువే. ప్రపంచంలోనే అత్యధిక మంది ఎక్కువ వాడే వెబ్‌బ్రౌజర్ గూగుల్ క్రోమ్.
ఇక వివరాల్లోకి వెళ్తే బ్లూమ్‌బర్గ్ కథనం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు పర్‌ప్లెక్సిటీ బయటినుంచి పెట్టుబడిదారుల సాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పెట్టుబడిదారులు ఫైనాన్స్ చేసేందుకు కూడా అంగీకరించినట్లు ఆ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి షెవెలెంకో చెప్పారు. అంతేకాదు పర్‌ప్లెక్సిటీ ఈ ఏడాది జులైలో 100 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆ తర్వాత ఫండింగ్ కౌండ్‌లో కంపెనీ మొత్తాన్ని లెక్కగట్టారు. దాని విలువ రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. గూగుల్ క్రోమ్ ఈ కంపెనీ ఆఫర్ చేసిన మొత్తం.. దాని విలువ కన్నా చాలా ఎక్కువ.
Also Read: ఆ దేశానికి అధ్యక్షుడిగా 20 ఏళ్ల కుర్రాడు.. ఎక్కడో తెలుసా ?
Perplexity CEO Arvind Srinivas Offer To Buy Google Chrome
మరో విషయం ఏంటటే క్రోమ్ కోర్ ఇంజిన్ అయినటువంటి క్రోమియంను ఓపెన్ సోర్స్‌గా కొనసాగిస్తామని పర్‌ప్లెక్సిటీ చెప్పింది. ఏటా దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఒకవేళ ఈ ఒప్పందం సక్సెస్ అయితే పర్‌ప్లెక్సిటీని డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా కూడా మార్చబోమని చెప్పింది. గూగుల్ క్రోమ్‌గానే కొనసాగిస్తామని తెలిపింది.
మరోవైపు గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోందని ఆరోపణలు వచ్చాయి. యాపిల్, శాంసంగ్ వంటి పెద్ద సంస్థలతో గూగుల్ ఒప్పందాలు చేసుకున్నట్లు, ఆయా డివైజ్‌లో గూగుల్‌ను సెర్చ్ డిఫాల్డ్‌గా ఉంచడం కోసం ఆ సంస్థలకు డబ్బులు చెల్లించినట్లు పలువురు ఆరోపించారు. ఈ మేరకు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. గూగుల్ పాలసీలు చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం గూగుల్ క్రోమ్‌ను విక్రయించాలని.. సెర్చ్ డేటాను పోటీదారులకు లైసెన్స్ ఇవ్వాలని సూచించింది. అలాగే ఇతర ప్లాట్‌ఫాంలలో ప్రత్యేక ప్రమోషన్‌లో చేసుకునేందుకు చెల్లింపులు ఆపాలని ఆదేశించింది.
Also Read: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. ఒక్కటైన భారత్-చైనా
ఇదిలాఉండగా పర్‌ప్లెక్సిటీ అనేది ఏఐ ద్వారా పనిచేసే ఓ సెర్చ్ ఇంజిన్. ఇదికూడా చాట్‌జీపీటీ(ChatGPT) లాంట్ యాపే. ప్రస్తుతం దీనికి దాదాపు 10 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 2026 నాటికి వందల కోట్ల యూజర్లకు చేరుకోవాలని ఈ కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. అందుకోసం సార్ట్‌ఫోన్ తయారీదారులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పర్‌ప్లెక్సిటీ మన ఇండియాకు చెందిన కంపెనీయే. దీని కో ఫౌండర్ చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్ (31). ఈ కంపెనీకి సీఈవోగా కూడా ఆయనే కొనసాగుతున్నారు.