అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలు 50 శాతానికి సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనాకు భారత్ నుంచి డిజిల్ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత మొదటిసారిగా భారత్-చైనా మధ్య డీజిల్ షిప్‌మెంట్ జరగనుంది. అంతేకాదు ఇరుదేశాల మధ్య త్వరలోనే విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి.
Also Read: యూకేలో నీటి సంక్షోభం.. ఈమెయిల్స్ డిలీట్ చేయాలని కోరుతున్న ప్రభుత్వం
2020లో కొవిడ్ వల్ల భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మళ్లీ ఈ సేవలను త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భారత్‌కు యూరియా ఎగుమతులపై ఉన్న ఆంక్షలను చైనా సడలించింది. దీన్నిబట్టి చూస్తే భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు పెంచిన తర్వాతే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యూరియాను భారీగా దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ ఒకటి. అయితే త్వరలో చైనా నుంచి 3 లక్షల టన్నుల యూరియా ఎగుమతులు భారత్‌కు రానున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.
Also read: రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
2020లో భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు నెలకొన్న తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. భారత్ కూడా తాజాగా చైనా పౌరులకు టూరిస్టు విసాలపై ఉన్న ఆంక్షలు కూడా ఎత్తివేసింది. ఇదిలాఉండగా ఈ నెలఖారులో ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SEO) సదస్సులో పాల్గొననున్నారు. ఇప్పటికే చైనా విదేశాంగ శాఖ ఈ సదస్సును మోదీని స్వాగతిస్తున్నట్లు ప్రకటన కూడా చేసింది. అయితే ఈ సదస్సులో భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు పెంచుకునేలా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఓట్ల చోరీ వివాదం.. సోనియాగాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు