/rtv/media/media_files/2025/08/13/meet-this-20-years-old-who-formed-a-country-of-400-citizens-2025-08-13-18-16-16.jpg)
Meet This 20 Years old Who Formed A Country Of 400 Citizens
సాధారణంగా ఒక దేశానికి అధ్యక్షుడు అంటే వారి వయసు 50 ఏళ్ల పైబడే ఉంటుంది. కానీ ఓ 20 ఏళ్ల కుర్రాడు మాత్రం ఓ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అయితే అది ఓ స్వయం ప్రకటిత దేశం. దానికి సొంత కరెన్సీ, జెండా, కేబినెట్ కూడా ఉంది. ఇంతకీ ఆ యువకుడు ఎవరు ? ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఆస్ట్రేలియా మూలాలున్న డేనియల్ జాక్సన్ అనే యువకుడు 18 ఏళ్ల వయసులోనే సొంతగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షుడు కావాలని అనుకునేవాడు. అయితే క్రొయేషియా, సెర్బియా దేశాల మధ్య ఓ వివాదాస్పద భూమి ఉంది. దాని పేరు వెర్రిస్.
Also Read: యూకేలో నీటి సంక్షోభం.. ఈమెయిల్స్ డిలీట్ చేయాలని కోరుతున్న ప్రభుత్వం
2019, మే 30న ఇరుదేశాల మధ్య ఉన్న ఆ వివాదాస్పద ప్రాంతాన్ని డేనియల్ 'ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్' పేరుతో స్వయం ప్రకటిత దేశంగా ప్రకటించాడు. మొత్తం 125 ఏకరాల్లో ఈ దేశం ఉంది. అక్కడ 400 మంది పౌరులు ఉన్నారు. సొంత కరెన్సీ, జెండా, కేబినెట్ కూడా ఉంది. ఈ చిన్న దేశాన్ని పాకెట్ త్రీ అని కూడా పిలుస్తారు. అలా డేనియల్ అధ్యక్షుడిగా కొనసాగతున్న వేళ.. 2023లో అతడికి బిగ్‌షాక్ తగిలింది. ఆ చిన్న దేశంలో ఉంటున్న స్థానికులను, ఆ దేశ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న డేనియల్‌ను క్రోయేషియా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఆ ప్రాంతం నుంచి బహిష్కరించారు .
Also Read: రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
అయినప్పటికీ కూడా డేనియల్ ఆ చిన్న దేశాన్ని రిమోట్‌గా ఉండి నడిపిస్తున్నాడు. తాను జాతీయ భద్రతకు ముప్పని చెబుతూ క్రొయేషియా బహిష్కరించిందని అంటున్నాడు. అలాగే క్రోయేషియాతో తాను శాంతియుతంగా ఒప్పందం చేసుకొని.. ఆ చిన్న దేశాన్ని అధికారికంగా ప్రకటించేలా చేస్తానని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. చర్చలు సక్సెస్ అయ్యి ఆ దేశం అధికారికంగా ప్రకటిస్తే తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని చెబుతున్నాడు. ఆ దేశంలో తాను సాధారణ పౌరుడిగా ఉంటానని చెబుతున్నారు. ఆ ప్రాంతం తాను సొంతంగా సృష్టించిన దేశమని దాన్ని చూసి గర్విస్తుంటానని అంటున్నాడు .
అంతేకాదు ఆ చిన్న దేశంలో ఎవరినా పౌరసత్వం కావాలని కోరుకుంటే వైద్యం లేదా పోలిసింగ్ అనుభవం స్కిల్స్ ఉంటే చాలని చెబుతున్నాడు. ఇక ప్రాంతానికి చేరుకోవాలంటే ఏకైక మార్గం ఉంది. అదికూడా క్రొయేషియా నగరం ఒసిజెక్ నుంచి పడవ మార్గంలో చేరుకోవాలి. అయితే ఆ చిన్న ప్రాంతాన్ని డేనియల్ సొంత దేశంగా ప్రకటించి అధ్యక్షడిగా కొంతకాలం పాటు కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది .
Also Read: ఓట్ల చోరీ వివాదం.. సోనియాగాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు