/rtv/media/media_files/2025/08/18/in-that-country-those-tests-including-hiv-before-marriage-2025-08-18-19-38-50.jpg)
In that country, those tests, including HIV, before marriage.
Bahrain : కింగ్‌డం ఆఫ్ బహ్రెయిన్ గా గుర్తింపు పొందిన బహ్రెయిన్ దేశం ఒక చిన్న ద్వీపదేశం. ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది. ఇది భ్రయిన్ ద్వీపంతో కూడిన ద్వీపసమూహం. ఇది 55 కి.మీ పొడవు 18 కి.మీ వెడల్పు ఉంటుంది. కేవలం 16 లక్షల జనాభా మాత్రమే ఉండే ఈ దేశం చాలా అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. ముత్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఈ దేశపు ముత్యాలు నాణ్యత కలిగినవిగా గుర్తింపు పొందాయి. అయితే ఆరంభంలో ముస్లీం దేశంగా ప్రకటించుకున్నప్పటికీ 2002లో బహ్రయిన్ సార్వభౌమరాజ్యంగా ఆవిర్భవించింది. దేశం అభివృద్ధి చెందెందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు అమలు చేస్తుంది.
Also Read: 18 ఏళ్లు దాటిన వారికే పో*ర్న్ సైట్స్ యాక్సెస్.. కట్ చేస్తే ఊహించని ఫలితం
తాజాగా అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే పెళ్లికి ముందే అక్కడి వధూవరులిద్దరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నియమాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ త్వరలోనే వాటిని అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ నియమాల ప్రకారం ముఖ్యంగా హెచ్‌ఐవీ, డ్రగ్స్, మానసిక ఆరోగ్యం, జన్యు లోపాలు తదితర పరీక్షలన్నింటిని చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వాటిలో ఏదైనా వ్యాధి ఉన్నట్లు తేలితే వారి పెళ్లికి అన్‌ఫిట్ అయినట్లే. ఎలాంటి వ్యాధులు లేకుంటేనే వారి పెళ్లికి అంగీకరిస్తారన్నమాట.
నిజానికి సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఇలాంటి నియమాలు ఎప్పటినుండో కొనసాగతున్నాయి. ప్రీ మ్యారేజ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం పిలిచే ఈ టెస్టుల్లో ఫెయిల్ అయితే వారు పెళ్లికి దూరంగా ఉండాల్సిందే. సౌదీలో ఇలాంటి టెస్టులు నిర్వహించడం మూలంగా 60 శాతానికి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి పెళ్లిళ్లను ఆపేసింది. దీంతో వారంతా అనారోగ్య సమస్యలనుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే పెళ్లికి ముందే ఇలాంటి పరీక్షలు చేసుకోవడం వల్ల వారికి పుట్టే బిడ్డలు ఆరోగ్యంతో పాటు బలంగా పుడుతారని ఫలితంగా భవిష్యత్ దేశానికి వారు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఆదేశం భావిస్తోంది. అయితే సౌదీ అరేబియా కంటే కఠిన నియమాలను అమలు చేసే ఈ దేశంలో శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయట. మరీ ఈ రూల్స్ అమల్లోకి వస్తే ఎంతమంది రోగాలు బయటపడుతాయో చూడాల్సిందే.
Also Read: ముగింపులో కీలకంగా క్రిమియా.. దీని కోసమేనా 7లక్షల ప్రాణాలు బలి
ఇక మనదేశంలోనూ గోవాలో పెళ్లికి ముందు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పరీక్షలను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మేఘాలయ రాష్ట్రం పెళ్లికి ముందు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పరీక్షలను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకు రానుంది. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆ రాష్ర్టం భావిస్తోంది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించి మరణాలను నివారించవచ్చని ప్రభుత్వం కోరుకుంటుంది. లైంగిక సంబంధాలే హెచ్‌ఐవీ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. అందుకే హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పరీక్షలను తప్పనిసరి చేయనుంది.
Also Read: అటు రష్యా.. ఇటు ట్రంప్.. మధ్యలో నలిగిపోతున్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే!?