Russia-Ukraine War: ట్రంప్, జెలెన్‌స్కీ భేటీకి ముందు ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఏడుగురు మృతి

మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇతర అంశాల గురించి చర్చలు జరపనున్నారు. ట్రంప్‌ను కలిసేముందు జెలెన్‌స్కీ ఎక్స్‌ వేదికగా సంచలన పోస్టు చేశారు.

New Update
At least seven killed as Russian air strikes on Ukraine continue right before Trump-Zelenskyy talks

At least seven killed as Russian air strikes on Ukraine continue right before Trump-Zelenskyy talks

మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇతర అంశాల గురించి చర్చలు జరపనున్నారు. ట్రంప్‌ను కలిసేముందు జెలెన్‌స్కీ ఎక్స్‌ వేదికగా సంచలన పోస్టు చేశారు. రష్యా కావాలనే ఉక్రెయిన్ ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను చంపుతోందని పేర్కొన్నారు. ఖార్కీవ్‌లో రష్యా డ్రోన్ దాడులు చేసిందని తెలిపారు. ఈ దాడిలో 7గురు చనిపోయారని పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారని చెప్పారు. అలాగే జాపోరిజియాలో జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందారని, 20 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. యుద్ధం ముగించేందుకు ఒప్పందం అంగీకరించాలని అమెరికా ఒత్తిడి తీసుకన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: నెలకు లక్షకు పైగా జీతంతో ఎల్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!

'' ఇది రష్యా క్రూరమైన దాడి. యుద్ధాన్ని ముగించేందుకు పరిష్కారం కోసం ఈరోజు వాషింగ్టన్‌లో సమావేశం ఉందని వాళ్లకు తెలుసు. ట్రంప్‌తో కీలకమైన అంశాల గురించి మేము చర్చలు జరుపుతాం. ఉక్రెయిన్‌తో పాటు.. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్‌లాండ్, యూరోపియన్ యూనియన్‌, నాటో నేతలు కూడా మాట్లాడనున్నారు. ప్రతిఒక్కరు శాంతి, నిజమైన భద్రతను కోరుతున్నారు. ఈ సమయంలో రష్యన్లు ఖార్కీవ్, జాపోర్జియా, సుమీ రీజియన్, ఒజెసా ప్రాంతలపై దాడులు చేస్తున్నారు. జనావాసం ఉన్న భవనాలను, పౌర మౌలికసదుపాయలను ధ్వంసం చేస్తున్నారు. 

Also Read: సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5489 కోట్లు స్వాధీనం..

రష్యన్లు కావాలనే ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను చంపుతున్నారు. ఖార్కీవ్‌లో డ్రోన్‌ దాడి వల్ల ఇప్పటిదాకా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో ఒకటిన్నేళ్ల చిన్నారి కూడా ఉంది. పదుల సంఖ్యలో చిన్నారులతో సహా గాయాలపాలయ్యారు.  జుపార్జియాలో క్షిపణి దాడి వల్ల ముగ్గురు చనిపోగా.. 20 మంది క్షతగాత్రులయ్యారు. బాధితులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఉక్రెయిన్, యూరప్‌పై ఒత్తిడిని కొనసాగించేందుకు, ద్వైపాక్షిక ప్రయత్నాలను అవమానించేందుకు పుతిన్‌ ఇలాంటి క్రూరత్వమైన హత్యలు చేసేందుకే కట్టుబడి ఉంటారు. అందుకే ఈ చావులకు ముగింపు పలికేందుకే మేము సాయాన్ని కోరుతున్నాం. అందుకే నమ్మకమైన భద్రతాపరమైన హామీలు అవసరం. అందుకే యుద్ధంలో పాల్గొన్న రష్యాకు రివార్డు ఇవ్వకూడదు. యుద్ధం కచ్చితంగా ముగియాలి. రష్యా కచ్చితంగా 'ఆపు' అనే మాటను వినాలని'' జెలెన్‌స్కీ రాసుకొచ్చారు. 

Also Read: 18 ఏళ్లు దాటిన వారికే పో*ర్న్ సైట్స్‌ యాక్సెస్‌.. కట్‌ చేస్తే ఊహించని ఫలితం

Advertisment
తాజా కథనాలు