Operation sindoor : భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణాన్ని నివారించి తగ్గించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తుంటే పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్ ప్రస్తుతం మరో కుట్రకు తెరలేపింది. భారత రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్థాన్ కు చెందిన గూఢచారులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా భారతీయ నిఘావర్గాల పేరు చెప్పి భారతీయ జర్నలిస్టులకు ఫోన్లు చేస్తున్నట్లు భారత నిఘావర్గాలు వెల్లడించాయి.
Also Read : మూడు పానీయాలు తాగితే కాలేయం కుళ్లిపోవడం ఖాయం..
తాము భారత్ రక్షణ శాఖ అధికారులమంటూ డిఫెన్స్ వార్తలు కవర్ చేసే జర్నలిస్టులకు ఫోన్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన విషయాలతో పాటు సైనిక అధికారులు ఏమంటున్నారు. పాక్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాక్ చేసిన దాడిలో భారత్‌కు ఎంత నష్టం జరిగింది తదితర వివరాలను ఆరా తీస్తున్నారని నిఘావర్గాలు గుర్తించాయి.
Also Read: పాక్‌ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!
జర్నలిస్టులతో పాటు పలువురు పౌరులకు కూడా పాక్ గూఢచారులు కాల్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కాల్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి వస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ అందులో వాస్తవం లేదని, భారత అధికారులెవరై అలా కాల్స్ చేయరని భారత నిఘావర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి కాల్స్ వస్తే ఆన్సర్ చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని నిఘావర్గాలు సూచించాయి.
Also Read: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 17 మంది ఆడశిశువులకు సిందూర్ పేరు
Also Read : విరాట్ కోహ్లీ సంపద తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఇన్ని కోట్లా భయ్యా!