Virat Kohli Net Worth: విరాట్ కోహ్లీ సంపద​ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఇన్ని కోట్లా భయ్యా!

విరాట్ కోహ్లీ క్రికెట్​లోనే కాదు సంపదలోనూ కింగ్​ అనే చెప్పుకోవాలి. అతడి నెట్​ వర్త్​, బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​, రియల్​ ఎస్టేట్​‌తో సంపాదిస్తున్న సంపద తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. విరాట్ నెట్ వర్త్ దాదాపు రూ.1,050 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.

New Update
Virat Kohli Net Worth

Virat Kohli Net Worth

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే క్రికెట్ ప్రియుల్లో తెలియని ఉత్సాహం. అతడు బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి వస్తున్నాడంటే.. ఉత్సాహం ఉరకేలుస్తుంది. విరాట్‌ను చూసేందుకు వేల సంఖ్యలో ప్రేక్షకులు, అభిమానులు స్టేడియంకు వస్తుంటారు. అతడి ఆటను తనివి తీరా వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఫ్యాన్స్‌కు తాజాగా విరాట్ బిగ్ షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అభిమానులు కోహ్లీ నెట్ వర్త్ ఎంత?.. అతడి బిజినెస్ వెంచర్ల గురించి ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు. ఇప్పుడు అన్ని వివరాలు తెలుసుకుందాం. 

Also Read: మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!

Virat Kohli Net Worth

కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ నెట్ వర్త్ దాదాపు రూ.1,050 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇక విరాట్ భార్య, నటి అనుష్క శర్మ నెట్ వర్త్ రూ.255 కోట్లు అని తెలిసింది. వీరిద్దరూ క్రికెట్, సినిమా, బిజినెస్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, పెట్టుబడులు ఇలా చాలా వాటిల్లో సక్సెస్ సాధించి దూసుకుపోతున్నారు. ఇలా వీటన్నింటితో ఇద్దరి నెట్‌వర్త్ దాదాపు రూ.1250 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా. ముఖ్యంగా విరాట్ కోహ్లీ నెట్ వర్త్ విషయానికొస్తే.. కోహ్లీ బీసీసీఐ ఏ+ సెంట్రల్​ కాంట్రాక్ట్​ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. 

Also Read : DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే

దీని ద్వారా ఏడాదికి రూ.7కోట్లు అందుకుంటున్నాడు. ఇదొక్కటి మాత్రమే కాకుండా మ్యాచ్ ఫీజు (T20లకు రూ.3లక్షలు, వన్డేలకు రూ.6లక్షలు, టెస్టులకు రూ.15లక్షలు) పొందుతున్నాడు. అలాగే ఐపీఎల్‌లోనూ బాగా వస్తున్నాయి. కోహ్లీ 2008 నుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు. అతడికి 2025 సీజన్‌లో రూ.21కోట్లు అందుతాయి. మొత్తం మీద ఒక్క ఐపీఎల్ (2008 నుంచి ఇప్పటి వరకు) కోహ్లీ రూ.212 కోట్లు సంపాదించినట్లు సమాచారం. 

Also Read: విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్‌.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్!

అలాగే వీటితో పాటు బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​లోనూ దూసుకుపోతున్నాడు. దాదాపు 30కి పైగా బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాడు. చాలా కంపెనీల బ్రాండ్స్‌ను అతడు ప్రమోట్ చేస్తున్నాడు. అందులో ​ఎఫ్​ టైరస్​, ఆడీ ఇండియా, పూమా,  మింత్ర సహా మరెన్నో ఉన్నాయి. వీటి ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నాడు. 

Also Read : పీవీకి అరుదైన గౌరవం

ఇంకా బిజినెస్‌లోనూ అతడు కింగే. కోహ్లీ వ్రాంగన్, వన్​8, నౌవా, చిసెల్​ ఫిట్​నెస్, బ్లూ ట్రైబ్, డిజిట్​ఇన్సూరెన్స్, రజ్​కాఫీ​ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాడు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్‌లోనూ అదరగొడుతున్నాడు. విరాట్ - అనుష్క శర్మ గురుగ్రామ్‌లో 10వేల స్క్వేర్‌ఫీట్ (రూ.80కోట్లు) ఉన్న మాన్షన్‌ను కలిగి ఉన్నారు. ముంబైలో కూడా వీరికి రూ.35 కోట్ల విలువ గల ఒక పెద్ద అపార్ట్‌మెంట్ ఉంది.

virat-kohli | latest-telugu-news | telugu-news | virat kohli retirement from test

Advertisment
తాజా కథనాలు