China: స్నేహమంటూనే చైనా మరో కుట్ర.. సరిహద్దుల్లో డ్రోన్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు పెంచిన తర్వాత మన దేశానికి చైనాతో సంబంధాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ (LAC) రేఖ వెంట శాంతిభద్రతలు కాపాడుకునేందుకు భారత్‌-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి.

New Update
China’s Infrastructure Buildup Near India’s Northern Borders

China’s Infrastructure Buildup Near India’s Northern Borders

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు(donald trump tariffs on india) పెంచిన తర్వాత మన దేశానికి చైనాతో సంబంధాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ (LAC) రేఖ వెంట శాంతిభద్రతలు కాపాడుకునేందుకు భారత్‌-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి కొనసాగుతోంది. అయినప్పటీకి చైనా మాత్రం తన దొంగబుద్ధిని మార్చుకోవడం లేదు. టిబెట్‌లోని భారత సరిహద్దు సమీపంలో తమ సైనిక మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. LAC వెంబడి చైనా మిలిటరీ అయిన పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (PLA) సైనిక వసతుల నిర్మాణాలు, లాజిస్టిక్స్ హబ్‌లను నిర్మస్తోంది. 

Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌..పెరిగిన స్పాట్‌ బుకింగ్స్‌

China’s Infrastructure Buildup Near India’s Northern Borders

తాజాగా  చైనా టిబెట్‌లో మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన 'చైనా ఏరోస్పేస్ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌' తమ రిపోర్ట్‌లో పేర్కొంది. దాదాపు 4300 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించిందని.. ఇందులో 720 మీటర్ల రన్‌వే, నాలుగు హ్యాంగర్లు, పరిపాలన భవంతులు ఉన్నట్లు అంచనా వేసింది. ఇక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితుల ఉండటంతో సైనికుల ఆరోగ్య పరిస్థితులు, కార్యకలాపాలపై తీవ్రంగా ఎఫెక్ట్‌ పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.  

ఇదిలాఉండగా గతంలో టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో సరైన రవాణా, నెట్‌వర్క్‌ సౌకర్యాలు సదుపాయలు ఉండేవి కావు. దీనివల్ల చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు తక్కువగానే ఉండేది. ఈ క్రమంలోనే భారత సరిహద్దుల్లో PLA సైనికులను మోహరించడం కోసం చైనా కొన్నేళ్ల నుంచి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రోడ్లను విస్తరించడం, అవుట్ పోస్టుల నిర్మాణం, క్యాంపుల ఏర్పాటు లాంటి చర్యలు తీసుకుంటోంది. 

Also Read: ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థలపై ఉగ్రవాద ముద్ర..ట్రంప్ కీలక నిర్ణయం

అయితే  తాజాగా టిబెట్‌లో మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రం, సైనిక వసతులు నిర్మాణ సౌకర్యాలను ఏర్పాటు చేయడం వల్ల డ్రాగన్‌ తమ సరిహద్దుల్లో బలగాన్ని పెంచుకుంటున్నట్లు సమాచారం. 

Advertisment
తాజా కథనాలు