/rtv/media/media_files/2025/11/25/fotojet-2025-11-25t125211956-2025-11-25-12-52-45.jpg)
sabarimala Temple
Sabarimala : శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు(sabarimala-devotees) పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్పాట్ బుకింగ్స్ పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.శబరిమల మండల-మకరవిళక్కు సందర్భంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణ చర్యలలో భాగంగా దర్శనం కోసం 75 వేల మంది భక్తులనే పరిమితం చేశారు. స్పాట్ బుకింగ్స్(online tickets booking for sabarimala) కూడా 20 వేల నుంచి 5 వేలకు తగ్గించారు.
కేరళ హైకోర్టు కూడా భక్తులు రద్దీలో చిక్కుకోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో భక్తుల సంఖ్యను 20,000 నుండి 5,000కు తగ్గించారు. పంపాతో సహా 3 ప్రదేశాలలో పనిచేస్తున్న ఇన్‌స్టంట్ బుకింగ్ కేంద్రాలు మూసివేశారు. దేవస్థానం బోర్డు తీసుకున్న ఈ కఠినమైన చర్య వల్ల ఇన్‌స్టంట్ బుకింగ్ ద్వారా భగవంతుని దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గర్భగుడితో సహా ప్రాంతాలలో కూడా రద్దీ లేదు.
అయితే భక్తుల రద్దీని బట్టి స్పాట్ బుకింగ్స్ పెంచుకోవడానికి దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం భక్తుల రద్దీని బట్టి స్పాట్ బుకింగ్స్ ద్వారా అనుమతించిన భక్తుల సంఖ్యను పెంచే పద్ధతి నేడో రేపో అమల్లోకి వస్తుందని సమాచారం. ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో మళ్లీ స్పాట్ బుకింగ్స్ పెంచాలని నిర్ణయం తీసుకుంది దేవస్థానం. ఈ విషయంపై శబరిమలలో పోలీసు అధికారుల సమావేశం జరిగింది. దీని కోసం కేరళ రాష్ట్ర డీజీపీ శబరిమల సందర్శించారు. భద్రతా చర్యలను కూడా పరిశీలించారు. శబరిమల సందర్శించే భక్తుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని డీజీపీ అన్నారు. భక్తుల రద్దీని బట్టి స్పాట్ బుకింగ్స్ ద్వారా అనుమతించిన భక్తుల సంఖ్యను 7,000 నుండి 8,000కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. - Sabarimala information
Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో బడా హీరో.. ఏకంగా ఆ సినిమాతో కనెక్షన్..?
శబరిమలలో అయ్యప్ప భక్తుల తాకిడి కొనసాగుతోంది. మండల పూజల నిమిత్తం ఈ నెల 16న అయ్యప్ప స్వామి సన్నిధానం ఆలయం తలుపులు తెరుచుకోగా.. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్‌లను పెంచడంతో.. సోమవారం నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది. ప్రస్తుతం పంపాబేస్, శరణ్‌గుత్తి, నడపండల్, సన్నిధానం.. ఇలా ఎక్కడ చూసినా.. అయ్యప్ప భక్తులే కనిపిస్తున్నారు. భక్తుల శరణుఘోషలతో పంచగిరులు మార్మోగిపోతున్నాయి.
నిజానికి గత వారం కేరళ హైకోర్టు ఆదేశాలతో స్పాట్ బుకింగ్‌ల సంఖ్యను రోజుకు 20 వేల నుంచి 5 వేలకు కుదించారు. శనివారం ఆ నిబంధనను హైకోర్టు సడలించడంతో.. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్‌ల సంఖ్య పెరిగింది. రద్దీని బట్టి స్పాట్ బుకింగ్‌ను పెంచుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో.. ఆదివారం నీలక్కల్, వండిపెరియార్, పంపాబేస్ వద్ద 11,516 మందికి స్పాట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 18 మెట్లపై నిమిషానికి సగటున 85 మంది భక్తులను అనుమతిస్తున్నట్లు వివరించారు.
Also Read: దుమ్ము రేపుతోన్న 'రాజు వెడ్స్ రాంబాయి' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. 4 డేస్ కలెక్షన్స్ ఇదిగో!
నిఘా నీడలో శబరిమల..
మరోవైపు హరిహరపుత్రుడైన అయ్యప్పస్వామి కొలువుదీరిన శబరిమలలో పకడ్బందీ నిఘా కొనసాగుతోంది. ఇప్పటికే సన్నిధానం, పంపాబేస్ వద్ద కేంద్ర బలగాలు మోహరించగా.. పంపా నుంచి శబరిపీఠం వచ్చే మార్గంలో.. నడపండాల్ వద్ద క్యూలైన్‌లో అధునాతన మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా ఉండేందుకు కేరళ పోలీసులు 450 సీసీకెమెరాలను అమర్చారు. సన్నిధానంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం(సీసీసీ)లో సిబ్బంది 24 గంటలూ ఈ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుంటారు. సన్నిధానం, పంపా నుంచి నడకదారి, పంపా పరిసర ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు.ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) 90 సీసీకెమెరాలను అమర్చగా.. పోలీసు, ఎక్సైజ్, అటవీశాఖలు మిగతా నిఘానేత్రాలను అందజేశాయి. భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేరళ పోలీసులు చెబుతున్నారు.
Follow Us