Pak-Saudi: ఒక్కటవుతున్న పాక్, సౌదీ అరేబియా...భారత్ ఎదుట బిగ్ సవాల్

భారత్ నుంచి కాపాడుకునేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాలలో దేనిపైనైనా దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.

New Update
pak, soudi

Pakistan-Saudi Arebia

ప్రపంచంలో ఓ వార్త ఇప్పుడు చర్చల్లో ఉంది. అదే సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందం. సౌదీ అరేబియాలో జరిగిన ముస్లిం దేశాల సమావేశానికి పాకిస్తాన్ కూడా హాజరయ్యింది.  దాంతో పాటూ ఆ దేశంతో పాకిస్తాన్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాలలో దేనిపైనైనా దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.  

Also Read :  Yogi Adityanath : దటీజ్ యోగి.. దిశాపటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు ఖతం !

భారత్ కు ముప్పు తప్పదా...

ఈ కొత్త ఒప్పందంతో భారత్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.  ఇండియాకు పాకిస్తాన్ తో ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్యా పరిస్థితులు చెడాయి. దానికి తోడు దాయాది దేశంతో ఉగ్ర కార్యకలాపాలతో కవ్విస్తూనే ఉంటుంది.  కానీ భవిష్యత్తులో పహల్గాం తరహాలో పాకిస్తాన్ ఉగ్రదాడికి దిగితే...దానిపై భారత్ యుద్ధం ప్రకటించింది అనుకుందాం. ప్రస్తుతం జరిగిన ఒప్పందం ప్రకారం అప్పుడు యుద్ధానికి పాకిస్తాన్, సౌదీ అరేబియా రెండూ వస్తాయి. ఎందుకంటే ఏ దేశంపై దాడి చేసినా రెండు దేశాలపై చేసినట్టే అవుతుందని చెబుతున్నారు. అలా అయితే ఇండియాకు ముప్పు తప్పదని అంచనా వస్తున్నారు.  సౌదీ అరేబియా బలమై దేశం. దాంతో పాటూ బాగా పలుకుబడి డబ్బులు ఉన్న దేశం.  వారి దగ్గర అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దేశం పాకిస్తాన్ కు అండగా నిలిస్తే...ఎవరైనా గెలవడం చాలా కష్టమే అవుతుంది. 

ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ కు సౌదీ అరేబియాతో ఈ ఒప్పందం వలన చాలా కలిసి వస్తుంది.  ఇప్పుడు ఈ ఒప్పందం.. ఆ దేశ చరిత్రలో ఇదొక దౌత్య విజయంగా అభివర్నిస్తున్నారు.  పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ బుధవారం రియాద్ లో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.  సౌదీ అరేబియాతో ఈ సమావేశాన్ని పాకిస్తాన్ ముస్లిం ప్రపంచ సోదరభావంగా చూపించింది.  ఇస్లామాబాద్ , రియాద్ మధ్య దాదాపు ఎనిమిది దశాబ్దాల చారిత్రాత్మక భాగస్వామ్యంతో పాటూ సోదరభావం ,ఇస్లామిక్ సంఘీభావం,... భాగస్వామ్య వ్యూహాత్మక ఆసక్తులు...సన్నిహిత రక్షణ సహకారం ఆదారంగా ఒప్పందం చేసుకున్నామాని పాక్ పీఎమ్వో ప్రకటించింది. 

Also Read :  Iran-Israel: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్

మరోవైపు పాక్, సౌదీ అరేబియా ఒప్పందం గురించి తమకు ముందే తెలుసునని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ పరిణామం మన జాతీయ భద్రతపై, అలాగే ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై చూపే ప్రభావాలను  అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. భారతదేశం జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి , అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. 

అదేం లేదు..

ఇంకోవైపు పాకిస్తాన్ ఈ ఒప్పందం గురించి తెగ గొప్పలు చెబుతోంది కానీ..సౌదీ అరేబియా మాత్రం మిగతా ఒప్పందాల్లానే ఇదీనని కొట్టి పారేసింది. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక, లోతైన సహకారాన్ని సంస్థాగతీకరించడం కోసమే చేసుకున్నామని చెప్పింది.  దీని అర్ధం పాకిస్తాన్ వ్యతిరేక దేశాలన్నింటి మీదా తాము పోరాడతామని కాదని తేల్చి చెప్పింది.   అణుశక్తి కలిగిన పాకిస్తాన్ ప్రత్యర్థి భారతదేశంతో సంబంధాలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశానికి ఉందని..సౌదీకి చెందిన ఒక అధికారి అన్నారు. భారతదేశంతో మా సంబంధాలు గతంలో కంటే బలంగా ఉన్నాయి. మేము ఈ సంబంధాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటాము. ప్రాంతీయ శాంతికి అన్ని విధాలుగా దోహదపడటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. 

Also Read: stock market: అమెరికా వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. లాభాల్లో దేశీయ మార్కెట్లు

Advertisment
తాజా కథనాలు