Iran-Israel: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్

ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇరాన్‌లో బహిరంగంగా ఉరితీశారు.

New Update
Iran executes man for alleged spying for Israel

Iran executes man for alleged spying for Israel

ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్(iran-israel) మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇరాన్‌లో బహిరంగంగా ఉరితీశారు. ఇరాన్‌కు చెందిన డేటా సెంటర్లు, ఇతర భద్రతాపరమైన అంశాల గురించి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ అయిన మొస్సాద్‌కు బాబాక్ షాబాజీ అనే వ్యక్తి కీలక సమాచారం అందించాడనే ఆరోపణలతో అతడిని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అతడికి ఉరిశిక్ష అమలు చేసినట్లు ఇరాన్‌ న్యాయవ్యవస్థ వెల్లడించింది. బాబాక్‌.. పొరుగు దేశంలో ఇజ్రాయెల్ ఏజెంట్లతో భేటీ అయినట్లు ఆరోపణలు చేసింది.  

Also Read: 75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్.. ప్రధాని మోదీ హెల్తీ డైట్ ఏంటో మీకు తెలుసా?

దీంతో అతడిని తప్పుడు కేసులో ఇరికించి టార్చర్‌ చేసినట్లు నిరసనలు జరిగాయి. మానవ హక్కుల కార్యకర్తలు దీనిపై ఆందోళనలు చేశారు. ఉక్రెయిన్‌(Ukraine) కు జెలెన్‌స్కీ(zelenskyy) కి సాయం చేస్తూ లేఖ రాశాడని బాబాక్‌ షాబాజీని ఇరాన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు మాస్కో వినియోగించిన డ్రోన్‌లను ఇరాన్ రష్యాకు సరఫరా చేసిందని అన్నారు. యుద్ధంలో రష్యాకు ఇరాన్ సహకరిస్తోందనే విషయాన్ని బాబాక్ జెలెన్‌స్కీకి చెప్పినందుకే అతడిని ఉరి తీశారంటూ ఆరోపించారు. కానీ ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణపై ఉరి తీశామని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వీళ్ల ఆరోపణలను ఇరాన్ ఖండించింది. 

Also Read: పుతిన్‌కు బిగ్‌ షాక్‌.. విష ప్రయోగం వల్లే నావల్ని మృతి.. వెలుగులోకి సంచలన నిజాలు

Iran Executes Man For Alleged Spying For Israel

ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల పరస్పర దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్‌ కోర్టు ఇప్పటిదాకా 8 మందిని ఉరి తీసింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, పలు సంస్థలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇరాన్‌ న్యాయ ప్రక్రియలో పారదర్శకతపై విమర్శలు చేస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అసలు విచారణలు చేపట్టకుండా ఉరిశిక్ష అమలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాయి .  

Also read: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్ నుంచి అమెరికా అధ్యక్షుడికి హామీ

Advertisment
తాజా కథనాలు