South Sudan: దక్షిణ సూడాన్‌లో విమానం హైజాక్‌..ఆ తర్వాత ఏం జరిగిందంటే?

దక్షిణ సూడాన్‌ లో విమానం హైజాక్‌ కావడం కలకలం రేపింది. ఒక సహాయక విమానాన్నిహైజాక్‌ చేశాడు. అనంతరం హైజాకర్‌ ఆ విమానాన్ని చాద్‌కు మళ్లించాలని పైలట్‌ను బెదిరించాడు. అయితే తెలివిగా ఆలోచించిన పైలట్‌ విమానంలో ఇంధనం లేదని చెప్పి మరో ప్రాంతంలో దించి హైజాకర్ను

New Update
FotoJet - 2025-12-03T102240.119

Plane hijacked in South Sudan

South Sudan: దక్షిణ సూడాన్‌ లో విమానం హైజాక్‌ కావడం కలకలం రేపింది. ఒక సహాయక విమానాన్ని హైజాకర్‌ హైజాక్‌ చేశాడు. అనంతరం హైజాకర్‌ ఆ విమానాన్ని చాద్‌కు మళ్లించాలని పైలట్‌ను బెదిరించాడు. అయితే తెలివిగా ఆలోచించిన పైలట్‌విమానంలో ఇంధనం లేదని, ఇంధన నింపాల్సిన అవసరం ఉందని పైలట్‌ చాకచక్యంగా అబద్ధం ఆడాడు. అలా విమానాన్ని మరో ప్రాంతానికి తరలించాడు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు అక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో కథ సుఖాంతమైంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెస్నా గ్రాండ్‌ కారవాన్‌ అనే విమానంలో దక్షిణ సూడాన్‌ రాజధాని జుబా నుంచి మైవుట్‌కు వైద్య సామగ్రిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో విమానం టేకాఫ్‌ కావడానికి ముందే ఓ వ్యక్తి తుపాకీతో విమానంలోకి చొరబడ్డాడు.  అనంతరం వెనక క్యాబిన్‌లో దాక్కున్నాడు.  విమానం టేకాఫ్‌ తీసుకుని గాల్లో ఉండగా.. క్యాబిన్‌ లోంచి బయటకు వచ్చిన దుండగుడు దాన్ని హైజాక్‌ చేస్తున్నట్లు పైలట్‌కు తెలిపాడు. ఆఫ్రికా దేశం చాద్‌కు విమానాన్ని మళ్లించాలని పైలట్‌ను బెదిరించాడు. ఈ క్రమంలో విమానం కొన్ని గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది.  అతడు అబై ప్రాంతానికి చెందిన యాసిర్‌ మహమ్మద్‌ యూసఫ్‌గా గుర్తించారు. 

పైలట్‌ చాకచక్యం..  

అయితే విమానం హైజాక్‌  అయిన నేపథ్యంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. విమానంలో ఇంధనం నిండుకుందని,ఇంధనం నింపాల్సిఉందని చెప్పి.. దాన్ని హైజాకర్‌ చెప్పిన స్థలంలో కాకుండా వావులో ల్యాండ్ చేశాడు. వెంటనే అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే హైజాక్‌కు గల కారణాలు మాత్రం తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఎవరూ గాయపడలేదన్నారు. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇక, నిందితున్నిఅబై ప్రాంతానికి చెందిన యాసిర్‌ మహమ్మద్‌ యూసఫ్‌గా గుర్తించారు. 

నిందితుడు జుబా అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎయిర్‌ చార్టర్‌ కంపెనీ లోగో ఉన్న చొక్కాను ధరించినట్లు అధికారులు గుర్తించారు.  అయితే ఆ కంపెనీలో ఎంక్వయిరీ చేయగా అతడు ఆ కంపెనీలో ఎలాంటి విధులు నిర్వహించడం లేదని తేలింది. ఈ ఘటనపై విమానయాన కంపెనీ ప్రతినిధి మెలిస్సా స్ట్రీక్‌ల్యాండ్‌ స్పందించారు. విమానాన్ని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చిన భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు