/rtv/media/media_files/2025/05/26/vcZcGPFUioB9PLXpHSSp.jpg)
Pakistan High security for Indian spy Jyoti malhotra video viral
Jyoti Malhotra: పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన వీడియో బయటపడింది. శత్రుదేశంలో జ్యోతి రాజభోగాలు అనుభవించింది. పాక్ టూర్‌లో ఉన్నప్పుడు ఆమెకు AK47 గన్నులతోకూడిన ఏడుగురు గన్‌మెన్లను కేటాయించారు. మరో యూట్యూబర్ ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. జ్యోతి వీడియో తీస్తూ రోడ్డుపె వెళ్తుంటే తనతో గన్ మెన్లు దారీ చూపించడం, జనాలకు పక్కకు తప్పుకోమని చూపించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. మరికొంతమంది అధికారులు ఆమెకు షాపులు, స్ట్రీట్ వివరాలను వెల్లడిస్తున్నట్లు కనిపించింది. అయితే ఇదంతా వీడియో తీసిన ఫారిన్ యూట్యూబర్ మాత్రం చాలా ఆశ్చర్యపోయాడు. ఒక యూట్యూబర్ కు ఇంత సెక్యూరిటీ ఏమిటని? తానెప్పుడు ఇలా చూడలేదంటూ వీడియోలు వివరించాడు.
Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
- Scottish You Tuber Callum Mill uploaded this video in March 2025
— BALA (@erbmjha) May 26, 2025
- Pakistani spy Jyoti Malhotra was walking through Pak streets with 6 men armed with AK-47 rifles
- Why was there so much security for an ordinary YouTuber?
This ISI agent's friends & relatives should be… pic.twitter.com/wTWOSlR0sM
Also Read: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
మరోవైపు.. పాకిస్తాన్ తో గూఢచర్యం(Espionage with Pakistan) చేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని వివరాలను బయటపెట్టారు హరియాణా పోలీసులు. ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని తేల్చారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని తెలిపారు. అంతేకాదు జ్యోతికి సాయుధ దళాల గురించి కూడా అవగాహన లేదని చెప్పారు.
Also Read: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ జ్యోతికి సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను మేం గుర్తించలేదు. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలుపంచుకున్నట్లు సాక్ష్యాల్లేవని హిస్సార్ ఎస్పీ తెలియజేశారు. అయితే తనకు పరిచయమైన వారు పాక్ గూఢచర్య సంస్థకు చెందిన వారు అని తెలిసినా కూడా జ్యోతి స్నేహం కొనసాగించిందని...వారితో మాట్లాడుతూనే ఉందని చెప్పారు. అలాగే పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను ఆమె పెళ్ళి చేసుకోవాలని గానీ, మతం మార్చుకోవాలని కానీ అనుకోలేదని పోలీసులు చెబుతున్నారు. వీటికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు.
Also Read: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్