/rtv/media/media_files/2025/05/25/VmpWtTOCgKalNdI6ABWe.jpg)
Bangladesh Ex PM Sheikh Hasina
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ముమమ్మద్ యూనస్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. బంగ్లా అవామీ లీగ్ పార్టీని నిషేధించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. ఉగ్ర సంస్థల సాయంతో బంగ్లాదేశ్‌లో పాలన సాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అలాగే బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ మేరకు ఓ ఆడియోను విడుదల చేశారు.
Also Read: దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం
'' సెయింట్ మార్టిన్ ద్వీపం కోసం గతంలో అమెరికా పెట్టిన డిమాండ్లకు మా నాన్న షేక్ ముజిబుర్ రహ్మాన్ ఒప్పుకోలేదు. దీనికోసం ఆయన ప్రాణ త్యాగం కూడా చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉండటం కోసం దేశాన్ని అమ్మేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే నాకు ఈ దుస్థితి ఎదురయ్యింది. దేశంలో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా ఎవరూ వదులుకోరు. ఉగ్రవాద భావజాలమున్న వాళ్ల మద్దతుతో యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
నా ప్రభుత్వం పోరాటం చేసిన వాళ్లతో, అంతర్జాతీయంగా నిషేధానికి గురైన వాళ్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఒక్క ఉగ్రదాడి జరిగినా మేము కఠినంగా చర్యలు తీసుకున్నాం. చాలామందిని అరెస్టులు చేశాం. కానీ ఇప్పుడు మాత్రం జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ వదిలిపెడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉగ్రవాదుల రాజ్యం నడుస్తోందని'' షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంటు నిర్ణయం లేకుండా చట్టాన్ని ఎలా మారుస్తారని.. అవామీ లీగ్‌ను నిషేధించడం చట్టవిరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
bangladesh | sheik-hasina | telugu-news | rtv-news