పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా పాక్ భారత్‌పై డ్రోన్లతో దాడులకు దిగింది. వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది. భారత సైన్యం పాక్ ఆర్మీ బేస్‌ను నాశనం చేసింది. భారత్ దాడులను పాక్ తట్టుకోలేకపోతుంది. ఈ వార్ వల్ల పాక్ భారీగా నష్టం చూస్తోంది. దీంతో తగ్గితే బెటర్ అని అమెరికా పాక్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
"If India Stops, We Will Consider Stopping": Pak FM’s Bizarre Peace Pitch
— United Indian (@TheUnitedIndia2) May 10, 2025
After getting hammered in Operation Sindoor, Pakistan’s Foreign Minister now says, “If India stops, we will consider stopping.”
Sounds less like diplomacy, more like a timeout request after losing a round.… pic.twitter.com/euJ4aAr4Ik
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
భారత్ ఆపితే.. మేం కూడా ఆపుతాం..
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ భారత్‌కు ఓ కీలక ప్రతిపాదన చేశారు. భారత్ సైనిక దాడిని ఆపితే తమ దేశం కూడా ఆపడానికి ప్రయత్నిస్తుందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు ఉండటంతో వీటిని తగ్గించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
తమ దేశం ఎప్పుడూ కూడా శాంతిని కోరుకుంటుందని, ఇలాంటి ఉద్రిక్తత సమయంలో భారత్ దాడులు ఆపితే తాము కూడా ఆలోచిస్తామని ఇషాక్ దార్ తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని, శాంతిని కోరుకుంటున్నామని ఇషాక్ దార్ అన్నారు. సరిహద్దుల్లో భారత్ దాడులను తట్టుకోలేక పాక్ శాంతిని కోరుకుంటుందని తెలుస్తోంది.