/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
Pakistan PM Shehbaz Sharif
పాకిస్తాన్‌లో ప్రస్తుతం అశాంతి నెలకొంది. పలుచోట్ల బాంబు దాడులు జరుగుతున్నాయి, మరికొన్ని చోట్ల గుర్తు తెలియని ముష్కరుల భయం ఉంది. పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి ముప్పు తిప్పలు పెడుతోంది. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ , ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ BLA కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
Also Read: వలసదారులకు ట్రంప్ బిగ్ షాక్.. 5 లక్షల మందికి ఆ హోదా రద్దు
పాకిస్తాన్‌లో భద్రతపై ఆందోళన నెలకొంది. అయితే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇప్పుడు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్‌ను టార్గెట్ చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ప్రతిరోజూ జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. BLA సాకుతో షాబాజ్ షరీఫ్‌ను, అతని ప్రభుత్వాన్ని బలహీనమైన పాలనగా అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్‌లో భద్రత క్షీణించడానికి రాజకీయ నాయకులే కారణమని ఆరోపించారు.
Also Read: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన భద్రతా సమావేశంలో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మెరుగైన పాలన అవసరమని స్పష్టం చేశారు. బలహీనమైన పాలన కారణంగా పాకిస్తాన్ ప్రజలు ఎంతకాలం ప్రాణత్యాగం చేస్తారని ప్రశ్నించారు. మునీర్ చేసిన ఈ వ్యా్ఖ్యలు.. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం బలహీన పాలనను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్.. బలూచ్‌లతో యుద్ధం, పాకిస్తాన్‌లో దాడులపై షాబాజ్ షరీఫ్‌ను నిందిస్తున్నట్లే, 25 సంవత్సరాల క్రితం పాక్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ కూడా కార్గిల్ ఓటమికి షహబాద్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్‌ను నిందించారు. మొత్తానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల వల్ల.. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సైన్యం నుంచి తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తోంది.
Also Read: సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్ జీతం చెల్లిస్తా : ట్రంప్
Also Read: లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
telugu-news | pakistan | balochistan | shehbaz-sharif | pakistan-army