India-China: లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

చైనా మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దుల విషయంలో ఒకవైపు చర్చలు జరుపుతూనే లడక్ భూభాగంలో కౌంటీలను ఏర్పాటు చేస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్...చైనా దురాక్రమణలను ఎప్పటికీ ఒప్పుకోమని స్పష్టం చేసింది. 

New Update
LAC Row : చైనా వంకరబుద్ది..ప్రధాని మోదీ అరుణాచల్ పర్యటనపై అక్కసు.!

 ఎన్ని సార్లు చెప్పినా చైనా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. అంతకు ముందు అరుణాచల్ ప్రదేశ్ లో కౌంటీలను ఏర్పాటు చేసి తగవులకు దిగిన డ్రాగన్ కంట్రీ ఇప్పుగు తన దృష్టిని లడక్ మీద వేసింది.

భారత భూభాగంలో కౌంటీలు..

అక్కడ రెండు కౌంటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ కౌంటీల్లోని కొన్ని భాగాలు లద్దాఖ్‌ పరిధిలోకి వస్తాయి. దీనిపై తాజాగా భారత్ స్పందించింది. కౌంటీల విషయం తమ దృష్టికి వచ్చిందని..ఇటువంటి దురాక్రమణలను ఎప్పటికీ అంగీకరించమని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సార్వభౌమాధికారానికి సంబంధించి మా దీర్ఘకాల, స్థిరమైన వైఖరిపై ఈ కౌంటీల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పింది. చైనా చేస్తున్న ఆక్రమణలకు చట్టబద్ధత ఉండదని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ పార్లమెంట్‌కు తెలిపారు. దీనిపై దౌత్య మార్గాల ద్వారా భారత్ నిరసన తెలియజేశామని అన్నారు. 

అంతకుముందు రెండు నెలల క్రితం తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) సమీపంలో చైనా (China) సైనిక విన్యాసాలు నిర్వహించింది. అత్యంత కఠిన ప్రదేశాల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్‌ సరఫరా వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని పీఎల్‌ఏ వీటిని నిర్వహిస్తోంది.  భారత సైన్యం స్థాపన దినోత్సవానికి కొన్ని రోజుల ముందు చైనా వీటిని మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.  జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్ కు చెందిన రెజిమెంట్ నేతృత్వంలో వీటిని చేపట్టింది. అత్యాధునిక సైనిక టెక్నాలజీ, ఆల్‌ టెర్రైన్‌ వెహికల్స్‌, అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌, డ్రోన్లు, ఎక్సో స్కెలిటెన్స్‌ వంటి వాటిని ఈ విన్యాసాల్లో వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని భారత ధళాలు అలెర్ట్ అయ్యాయి. 

 today-latest-news-in-telugu | india-china | ladakh 

Also Read: HYD: 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు..ఐపీఎల్ మ్యాచ్ ల సెక్యూరిటీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు