Trump: సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం చెల్లిస్తా : ట్రంప్

సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌కు అదనపు వేతనం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. నేను చేయాల్సివస్తే నా జేబు నుంచి వాళ్లకి ఓవర్‌టైమ్‌ శాలరీ చెల్లిస్తానని తెలిపారు.

New Update
Trump and Sunita Williams

Trump and Sunita Williams

అంతరిక్ష కేంద్రంలో (ISS) 9 నెలల పాటు చిక్కుకపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ ఇటీవల భూమిపైకి చేరుకున్న సంగతి తెలిసిందే. కేవలం 8 రోజుల పర్యటన నిమిత్తం వీళ్లు ఐఎస్‌ఐఎస్‌కు వెళ్లారు. కానీ వారు వచ్చిన వ్యోమనౌకలో సాంకేతిక లోపం కారణంగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ ఉన్నట్లయితే అదనపు జీతం ఉండదు. అయితే తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. వాళ్లకు ఓవర్‌టైమ్ జీతాన్ని సొంతంగా చెల్లిస్తానని ప్రకటించారు. 

సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌కు అదనపు వేతనం ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. '' నేను చేయాల్సివస్తే నా జేబు నుంచి వాళ్లకి ఓవర్‌టైమ్‌ శాలరీ ఇస్తాను. ఆస్ట్రోనాట్స్‌ను సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలాన్‌ మస్క్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన లేకపోతే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించండి అంటూ'' ట్రంప్ అన్నారు. 

Also Read: వలసదారులకు ట్రంప్ బిగ్‌ షాక్.. 5 లక్షల మందికి ఆ హోదా రద్దు

అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ కాలం ఉండే వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఈ విషయాన్ని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్‌మన్‌ చెప్పారు. ఫెడరల్ ఉద్యోగులు కావడం వల్ల అంతరిక్షంలో వాళ్లు పనిచేసినప్పటికీ కూడా భూమిపై సాధరణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా వచ్చే శాలరీతో పాటు ఐఎస్‌ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను మాత్రం నాసా భరిస్తుందని తెలిపారు. 

ఏవైనా ఇలాంటి అనుహ్య పరిణామాలు జరిగినప్పుడు అదనంగా రోజుకు నాలుగు డాలర్లు (దాదాపు రూ.348) మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందన్నారు. 2010-11లో మిషన్‌లో భాగంగా 159 రోజులు పాటు ఐఎస్‌ఎస్‌లో ఉన్నానని.. అప్పుడు తనకు 632 డాలర్లు మాత్రమే అదనంగా చెల్లించినట్లు చెప్పారు. దీన్నిబట్టి చూస్తే సునీతా విలియమ్స్‌కు, బుచ్‌ విల్మోర్‌ తొమ్మిది నెలలు స్పేస్‌లో ఉన్నందుకు దాదాపు 1100 డాలర్లు (సుమారు రూ.లక్ష) మాత్రమే అదనంగా పొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Also Read: నేడు వరల్డ్‌ ఎర్త్‌ అవర్‌ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు

జీతం పరంగా చూస్తే నాసా ఉద్యోగులు.. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతాన్నే పొందుతారు. అయితే వ్యోమగాములకు జనర్ షెడ్యూల్‌ జీఎస్-13 నుంచి జీఎస్‌-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లు జీఎస్‌-15 గ్రేడ్‌ పే శాలరీ తీసుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే వార్షిక వేతనం 1,24,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు) మధ్య ఉంటుంది. 

 telugu-news | rtv-news | trump | butch wilmore and sunita williams

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు