/rtv/media/media_files/2025/03/22/jr7k3No9ZKTRdVy9XGla.jpg)
World Earth Hour Day
భూ మండలాన్ని భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించాలనే లక్ష్యంతో ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ డేను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 22న (శనివారం) ఎర్త్ అవర్ డేను పాటించనున్నారు. శనివారం రాత్రి 8.30 PM గంటల నుంచి 9.30 PM గంటల వరకు ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేయనున్నారు. గంట పాటు లైట్లను ఆర్పేస్తే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది నిపుణుల అభిప్రాయం.
Also Read: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!
అందుకే ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ డేను పాటిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8:30 PM నుంచి 9:30 PM వరకు ప్రజలందరూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి ఎర్త్ అవర్ డేను పాటించాలని కోరారు. 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' సంస్థ ఆధ్వర్యంలో పాటిస్తున్న ఎర్త్ అవర్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కరెంట్‌ను కూడా ఎంతగానో నిల్వచేయొచ్చు.
Also Read: ఇండియాలో ఏ రాష్ట్రం మంచిదో చెప్పిన సర్వే.. కేరళ ఫస్ట్, పంజాబ్ లాస్ట్
ఇలా చేయడం వల్ల వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములై భావితరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంతో సాయపడదామని తెలిపారు. ఇదిలాఉండగా.. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతీ ఏడాది ఎర్త్ అవర్ డే ను ప్రపంచ దేశాలు పాటిస్తూ వస్తున్నాయి.
Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మంది కార్మికులు!
Also Read: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్..అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం
rtv-news | telugu-news | earth | earth-hour-day | world-earth-hour
Follow Us