Indians In America: అమెరికాలో 30 ఇండియన్ డ్రైవర్లు అరెస్ట్

అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను అరెస్ట్ చేశారు.

New Update
_Indians In America

అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను అరెస్ట్ చేశారు. మొత్తం 100 మంది ట్రక్ డ్రైవర్లను యూఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 30 మంది ఇండియన్స్. ఇది అమెరికాలోని భారతీయ కమ్యూనిటీలో ఒక్కసారిగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారు, పర్యాటక వీసాలపై వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారు, అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. పట్టుబడ్డ 30 మంది భారతీయులు డ్రైవర్లుగా పని చేస్తూ వేర్వేరు నగరాల్లో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

పట్టుబడ్డ వారిలో చాలామంది స్టూడెంట్ వీసా లేదా విజిటర్ వీసాపై వచ్చి, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. కొందరు మెక్సికో లేదా కెనడా సరిహద్దుల నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెసిడెన్సికి సంబంధించి ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు చూపకపోవడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని ప్రస్తుతం స్థానిక ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. వీరికి ఇమ్మిగ్రేషన్ కోర్టులో విచారణ జరిపిన అనంతరం, స్వదేశానికి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇటీవల అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ట్రక్కులు నడుపుతూ చేసిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఈ చర్యలకు కారణమైంది. భారతీయ డ్రైవ‌ర్ల కార‌ణంగా జ‌రిగిన‌ కొన్ని ప్రమాదాల్లో యువకులు, చిన్నారులు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ సెమీ ట్రక్‌లు నడపకూడదు. ప్రజల భద్రతే మా ప్రథమ లక్ష్యం” అని ఎల్ సెంట్రో సెక్టర్ యాక్టింగ్ చీఫ్ జోసెఫ్ రెమేనార్ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు