Kavita: ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ నుంచి కవితకు ఆహ్వానం.. ఎందుకంటే..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆక్స్ఫర్డ్ యూనిర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అక్టోబర్ 30న నిర్వహించే కార్యక్రమంలో.. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎలా పురోగమించింది, రైతులకు రైతుబంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, అలాగే 24 గంటల ఉచిత కరెంట్ తదితర అంశాలపై కవిత ప్రసంగం చేయనున్నారు.