/rtv/media/media_files/2025/12/24/bangla-2025-12-24-14-54-47.jpg)
You Had Osman Hadi Killed To Derail Polls, Big Charge Against Yunus Regime
బంగ్లాదేశ్(bangladesh) లో యువనేత ఉస్మాన్ హదీ హత్య(Osman Hadi death)తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హత్యలో అక్కడి ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus government) మెడకే చుట్టుకుంటోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం(Yunus Regime) లో కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు అతడి సోదరుడు ఆరోపణలు చేశాడు. హదీని మీరే (యూనస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) చంపేశారంటూ వ్యాఖ్యానించాడు. ఈ హత్య ఘటనను వాడుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారని అన్నాడు.
తన సోదరుడిపై హత్యపై వెంటనే విచారణ జరిపి హంతకులను పట్టుకోవాలని కోరాడు. హదీకి న్యాయం చేయకపోతే మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించాడు. గతేడాది మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో హదీ కీలక పాత్ర పోషించారు. తాజాగా అతడి హత్య వెనుకు యూనస్ ప్రభుత్వం ఉందని అనుమానాలు రావడం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే హదీ సోదరుడు షేక్ హసీనాకు పట్టిన గతే యూనస్‌కు పడుతుందని పరోక్షంగా హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో హదీ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇలాంటి తరుణంలో అతడి హత్యకు గురవ్వడం అల్లర్లకు దారి తీసింది.
Also Read: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!
Osman Hadi Killed To Derail Polls
మరోవైపు అవామీ లీగ్ పార్టీని యూనస్ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే ఛాన్స్ లేదు. ఈ నిర్ణయంపై అమెరికా చట్టసభ్యుల్లో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శక, స్వేచ్ఛాయుత విధానంలో బంగ్లాదేశ్ ప్రజలకు ఉందని అన్నారు. ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కలసి ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు అవామీ లీగ్ పార్టీని ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించారు.
Also Read: భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.. ‘వారికే మొదట వీసా’
ఇదిలాఉండగా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా బంగ్లాదేశ్‌లో భారీ ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ఛాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అమెరికా, జర్మనీ వంటి పలు దేశాలు బంగ్లాదేశ్‌లో తమ రాయబార కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటన చేశాయి. బంగ్లాదేశ్‌లో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి హిందూవులు, క్రైస్తవులు మైనార్టీలుగా కొనసాగుతున్నారు. ఇటీవల అక్కడ భారత రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే.
Follow Us