/rtv/media/media_files/2025/01/28/0ZgvrfqmK83oumWT4s1B.jpg)
DEEPSEEK Photograph: (DEEPSEEK)
కృతిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించిన చైనా డీప్‌సీక్.. (DeepSeek) దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా టెక్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక ప్రకటన చేసింది. డీప్ రీసెర్చ్ పేరుతో కొత్త టూల్ ను ఆవిష్కరించింది. మనిషి చాలా గంటల్లో చేసే పనిని ఈ కొత్త టూల్ పది నిమిషాల్లోనే చేసి పెడుతుందని కంపెనీ వెల్లడించింది.
Also Read: Trump-panama canal: పనామా కాలువ పై... ట్రంప్ ఇచ్చిన పవర్ ఫుల్ అప్డేట్!
Open AI Deep Research
ఓపెన్ ఏఐ తదుపరి ఏజెంట్ డీప్ రీసెర్చ్ స్వతంత్రంగా పని చేయగలదు. మీరు ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీ నే వందలాది ఆన్ లైన్ సోర్సులను విశ్లేషించి..రీసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో సమగ్ర నివేదిక రూపొందిస్తుంది అని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.టోక్యోలో ఉన్నత స్థాయి సమావేశానికి ముందు కంపెనీ ఈ టూల్ ను ఆవిష్కరించింది.
Also Read: Flight Accident: రన్ వే పై టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు!
ఓపెన్ ఏఐ (Open AI) చీఫ్ శామ్ ఆల్ట్‌మన్ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా,టెక్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ అధినేత మనయోషి సన్ తో ఆయన చర్చలు జరపనున్నారు.ఓపెన్ ఏఐ , సాఫ్ట్ బ్యాంక్ , ఒరాకిల్ కలిసి స్టార్‌గేట్ పేరుతో సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సంస్థ కృతిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ..చైనాకు చెందిన డీప్ సీక్ ఇటీవల అమెరికా టెక్ స్టాక్స్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. హాంగ్జౌకు చెందిన ఈ ఏఐ రీసెర్చ్ సంస్థ..కొన్ని రోజుల కిందట ఆర్ 1 పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది.ఇది పూర్తిగా ఉచితం.
ఓపెన్ ఏఐ,క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు ఇందుకోసం అడ్వాన్స్ ఏఐ మోడల్ ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తుండడంతో డీప్‌సీక్ పేరు నెట్టింట మార్మోగింది.అంతేకాదు..టెస్ట్ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్ ఏఐ,గూగుల్ ,మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చిస్తున్న వేళ..డీప్‌సీక్ మాత్రం కేవలం 6 మిలియన్ డాలర్లతో లేటేస్ట్ ఏఐ మోడల్ ను రూపొందించడం గమనార్హం.
Also Read:Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మూడు రోజుల పాటు ఆ టికెట్లు రద్దు!