/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
TTD
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని.. తిరుపతిలో ప్రతిరోజూ మూడు కేంద్రాల్లో సాధారణ భక్తులకు ప్రతి ఇచ్చే దివ్యదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
TTD Canceled To Special Darshan Tokens
మూడు, నాలుగు, ఐదు తేదీలకు సంబంధించిన టోకెన్ల జారీ చేయడంలేదని టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.. వారాంతం కావడంతో పాటు, ఈ నెల 4న రథసప్తమి ఉండటంతో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వచ్చిన వారికి శ్రీపద్మావతి, ఎంబీసీ-34 పరిధిలో గదుల కేటాయించింది.
అలాగే గదుల కోసం శ్రీపద్మావతి ఎంక్వైరీ సెంటర్ దగ్గర ఉదయం నుంచే భక్తుల రద్దీ భారీగా కనిపించారు. ఈ మేరకు ఆ విచారణ కేంద్రం నుంచి రోడ్డు వరకు భక్తులు క్యూలైన్‌లో రెండు, మూడు గంటల పాటు వేచి ఉండటం కనిపించింది.తిరుమలలో రథసప్తమికి వచ్చే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామల రావు కోరారు. ఈ మేరకు తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బందిలతో సమావేశం నిర్వహించారు.
'రథసప్తమి (Rathasapthami) రోజున గ్యాలరీలలో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రతి గ్యాలరీకి ఇంఛార్జితో పాటు , అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలని ఈవో కోరారు.
Also Read: Kumbh Mela : కుంభమేళాలో వసంతపంచమి అమృతస్నానాలు.. ఎంతమందంటే..
Also Read: Elon Musk: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు