/rtv/media/media_files/2025/02/03/zE0f1TYPoDdE54SAcZoP.jpg)
flightaccident
హ్యుస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అవుతుండగా ఆకస్మాత్తుగా దాని రెక్కల్లో ఒక దాని నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర తలుపును తెరవగా ఇన్ ప్లేటబుల్ స్లైడ్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రయాణికులను సురక్షితంగా దించేశారు.
వెంటనే అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టర్ ఫైర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.విమాన ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం104 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వివరించారు.
🚨 BREAKING: United Airlines flight evacuated this morning after the plane caught fire during takeoff - FOX26
— Eric Daugherty (@EricLDaugh) February 2, 2025
The incident took place at George Bush Intercontinental Airport in Houston, Texas.pic.twitter.com/LEj0DWDrBb
మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.
ఇటీవల అమెరికాలో రెండు విమాన ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రమాదం జరగడంతో ఎఫ్‌ఏఏ ప్రమాదాలకు గల కారణాలపై దర్యాప్తును వేగవంతం చేసింది. జనవరి 30న వాషింగ్టన్ డీసీలో మిలిటరీ హెలికాఫ్టర్, అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ఢీకొట్టడంతో రెండింట్లో ఉన్న మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఫిలడెల్ఫియాలోని ఓ మాల్ సమీపంలో మెడికల్ ట్రాన్స్ పోర్టర్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మూడు రోజుల పాటు ఆ టికెట్లు రద్దు!
Also Read:Elon Musk: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు