Tanuku SI: పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు!

తణుకు రూరల్‌ ఎస్సై ఏజీఎస్‌ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన తన స్నేహితునితో మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తన భార్య పిల్లల గురించి అన్న మాటలు అందర్ని కంతడి పెట్టిస్తున్నాయి.

New Update
tanuku si

tanuku si

Tanuku SI: తణుకు గ్రామీణ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన స్నేహితునితో ఫోన్‌ లో మాట్లాడారు. తాజాగా ఆ ఆడియో బయటకు రావడంతో అందరూ కంటతడి పెడుతున్నారు. ఆ కాల్‌ లో  మూర్తి సంబంధం లేని విషయంలో నన్ను కావాలనే ఇరికించి,ఆ ఇద్దరూ ఇబ్బందులు పెడుతున్నారని,విజ్జిని,పిల్లల్ని తలచుకుంటే బాధేస్తోందని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

తన స్నేహితునికి ఫోన్‌ చేసి..'' రేంజ్‌కి రిపోర్టు చేయమని శుక్రవారం ఆర్డర్‌ వచ్చింది. నాకు జీవితం మీద ఆసక్తి లేదు. నన్ను మోసం చేసిన ఆ ఇద్దరూ కూడా సంతోషంగానే ఉన్నారు.వీఆర్‌ భీమవరంలోనే కదా అని ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. నేనైతే అక్కడికి వెళ్లి రిపోర్టు చేయలేను.

Also Read: Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్‌ అదిరిందిగా..!

నా మనసేమీ బాగోలేదు.నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దర్ని ఎంతగానో మొత్తుకున్నాను. కానీ వాళ్లు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఎంతో సంతోషంగా ఉన్న నా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు. అక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. ముందుగా ఊహించిందే జరుగుతుంది. విజ్జి , పిల్లల పరిస్థితి తలచుకుంటేనే బాధగా ఉంది. మనమందరం సంతోషంగా ఉంటామని అనుకున్నాను. కృష్ణాజిల్లాకు పంపిస్తారు. ఒకరోజు కూడా నేను అక్కడ ఉండలేను'' అంటూ స్నేహితుని దగ్గర ఆయన ఆవేదన వెళ్లబోసుకున్నారు.

దీంతో ఆయన స్నేహితుడు నువ్వు కంగారు పడి పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దు.పాజిటివ్ గా ఆలోచించు.నీకు మైండ్ సెట్‌ బాగోలేదు. నువ్వు లేకపోతే భార్యాపిల్లలను ఎవరు చూస్తారు.నీకు అన్యాయం జరిగింది. నువ్వు చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? నీ కుటుంబాన్ని  ఎవరు ఆదుకుంటారు.

ఆ ఇద్దరూ నీకోసమేమి ఉద్యోగం వదులుకోరు కదా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నీ భార్యకి పుట్టింటి వారు కూడా ఎవరూ లేరు.మీ అన్నలు చూసుకున్నదానికి నువ్వు చూసుకున్నదానికి తేడా ఉంటుంది. ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందేమీ లేదు. అవసరమైతే నేను కూడా వస్తాను. జిల్లా మారితే మార్పు వస్తుందేమో చూద్దాం. నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా కాస్త ఆలోచించు. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది'' అని ఎంత చెప్పినప్పటికీ కూడా మూర్తి మాత్రం వినలేదు.

ఈ ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో అందరూ కంటతడి పెడుతున్నారు.

Also Read: BIG BREAKING: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటి సంచలన ప్రకటన

Also Read: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు