ZelenSkyy: త్రైపాక్షిక సమావేశానికి నేను సిద్ధం.. జెలెన్ స్కీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనను తాను సమర్థిస్తున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. రష్యా, అమెరికాతో త్రైపాక్షిక సమావేశానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు ప్రాణాలు కాడ్డానికి ట్రంప్ ముందు రావడం హర్షణీమని అన్నారు.

New Update
zelen

Trump-Zelensky

యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) కృతజ్ఞతలు తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఉక్రెయిన్ లో ఎన్నికలు జరిపేందుకు..రష్యా, అమెరికాతో త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ట్రంప్ ప్రజలు ప్రాణాలు కాడ్డానికి ముందు రావడం హర్షణీమని అన్నారు. తమ దేశానికి యుద్ధ విరమణ ఎంతో అవసరమని తెలిపారు. దీని కోసం ట్రంప్ నుంచి తాము అన్ని రకాల భద్రతా హామీలను కోరుకుంటున్నామని జెలెన్ చెప్పారు. ఉక్రెయిన్‌ ఆర్మీని బలోపేతం చేయడానికి ట్రైనింగ్‌ మిషన్స్‌, ఇంటెలిజెన్స్‌ భాగస్వామ్యాన్ని ప్రధానంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Also Read :  ప్రధాని మోదీకి ఫోన్ చేసిన పుతిన్‌.. ఏం మాట్లాడారంటే ?

యుద్ధంతో ప్రపంచం అలిసిపోయింది...

మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin), నేడు ఉక్రెయిన్ జెలన్ స్కీ(Zelenskyy) లతో భేటీలు నిర్వహించి యుద్ధ విరమణ దిశగా ట్రంప్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈరోజు జెలన్ తో ఆయన వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. మూడున్నరేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ప్రపంచమంతా ఈ యుద్ధంతో అలిసిపోయిందని..అందుకే తాను దీన్ని ఎలా అయినా ఆపాలని అనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. పుతిన్, జెలెన్ ఇద్దరూ కూడా ఈ యుద్ధాన్ని ఆపాలని అనుకుంటున్నారని చెప్పారు. పుతిన్ తో జరిగిన సమావేశంలో మంచి పురోగతి ఉందని చెప్పిన ట్రంప్..జెలెన్ స్కీ తో సమావేశమవ్వడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. భద్రత హామీకి సంబంధించి రిపోర్టర్లు అడగగా.. ఉక్రెయిన్‌కు భారీ సహాయం చేస్తామని ట్రంప్‌ చెప్పారు. యూరప్‌ దేశాలు రక్షణ పరంగా మొదటి శ్రేణిలో ఉన్నట్లు తెలిపారు. ఆ దేశాలకు కూడా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Trump-Zelensky: యుద్ధం ముగుస్తుంది...శాంతి వైపుగా అడుగులు..ట్రంప్ కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు