Trump-Zelensky: యుద్ధం ముగుస్తుంది... శాంతి వైపుగా అడుగులు.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య సమావేశం ముగిసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా అడుగులు పడుతున్నాయిని ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాధినేతలూ సమావేశం అయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తుందన్నారు. 

New Update
trump meeting

Trump, Zelensky, Putin

వైట్ హౌస్ ఓల్ కార్యాలయంలో ట్రంప్, జెలెన్ స్కీ(Trump-Zelenskyy) భేటీ సజావుగా సాగింది. జెలెన్‌స్కీతో పాటు వచ్చిన యూరప్‌ దేశాల అధినేతలు, ఈయూ, నాటో నేతలు ఇందులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనకు జెలెన్ అంగీకరించారని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం అయ్యేందుకు ఆయన ఒప్పుకున్నారు. ఇరు దేశాధినేతలూ భేటీ అయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తుందని..యుద్ధం ముగిసే దిశగా అడుగులు పడ్డాయని ట్రంప్ ప్రకటించారు. 

Also Read :  త్రైపాక్షిక సమావేశానికి నేను సిద్ధం..జెలెన్ స్కీ

యుద్ధ ముగింపు దిశగా అడుగులు..

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడిరిక్‌ మెర్జ్‌, యూరోపియన్‌ కమిషన్‌ ఉర్సులా వాండెర్‌లెయన్‌, నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టెతో వైట్ హౌస్ లో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయని చెబుతున్నారు. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కు భద్రతా హామీలు అందించాలనే దానిపై ప్రధానంగా చర్చించారు.  జెలన్ స్కీ తో మాట్లాడాక..తాను పుతిన్(Putin) తో కూడా ఫోన్ లో మాట్లాడానని..ఇద్దరూ కలిసేందుకు సమ్మతించారని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వీరి భేటీ ఏర్పాట్లు ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.  దాదాపు నాలుగేళ్ళగా సాగుతున్న యుద్ధం ముగించేందుకు మాత్రం అడుగులు పడ్డాయని చెప్పుకొచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ సమన్వయంతో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సమావేశం జరగనుందని ట్రంప్ స్పష్టం చేశారు. 

Also Read :  ఆ దేశంలో పెళ్ళికి ముందే HIVతో పాటు ఆ పరీక్షలు.. ! ఎందుకో తెలుసా?

నిర్మాణాత్మకంగా..

అంతకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ట్రంప్ తో జరిగిన చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవి చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని... పలు భద్రతా హామీలపై చర్చించామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చర్రితలో నిలిచిపోయే కీలక ముందడుగని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ అన్నారు. అయితే రష్యా అధ్యక్షుడితో సమావేశానికి ముందే కాల్పులు విరమణ జరిగితే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని అందుకు మిత్రపక్షాలు కలిసిరావాలని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టె అన్నారు. 

Advertisment
తాజా కథనాలు