Trump: ట్రంప్‌కు నోబెల్‌ బహుమతి ఎందుకు రాలేదో తెలుసా ?.. నోబెల్ కమిటి చెప్పిన కారణం ఇదే

నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు.

New Update
Trump

Trump

నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు. ఇజ్రాయెల్, పాకిస్థాన్‌ లాంటి పలు దేశాలు కూడా ఆయనకు మద్దతు పలికాయి. అయినప్పటికీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ట్రంప్‌(Donald Trump)కు నోబెల్ ప్రైజ్‌ రాకపోవడానికి గల కారణాలపై నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్‌ జొర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్‌ స్పందించారు. '' ఆల్ఫెడ్‌ నోబెల్ ఆశయాలకు అనుగణంగా మాత్రమే విజేతలను ఎన్నుకుంటారు. నోబెల్ కమిటీ మీడియా, బహిరంగ ప్రచారాలను ఎల్లప్పుడు గమనిస్తోంది. నోబెల్ గ్రహీతల చిత్రాలు ఉన్న గదిలో కూర్చొని వాటిని గమనిస్తాం. 

Also Read: నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్‌హౌస్ సంచలన రియాక్షన్

Nobel Committee Chariman Responds On Trump Nobel Snub

ఆ గది మాకు ఎంతో ధైర్యాన్ని, సమగ్రతతో పనిచేసే శక్తిని ఇస్తుందని'' తెలిపారు. అంతేకాదు నోబెల్ కమిటీ అనేది త్వరగా దక్కిన దౌత్య విజయాల కన్నా స్థిరంగా, బహుపాక్షిక ప్రయత్నాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. దీని గురించి హెన్నీ జాక్సన్ సొసైటీలో చరిత్రకారుడిగా పేరుపొందిన థియో జెనౌ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ''ట్రంప్‌ ప్రయత్నాలు సుస్థిరమైన ఫలితాలు ఇస్తాయని ఇంకా నిరూపితం కాలేదు. ఒక ఘర్షణను కొంతకాలం పాటు ఆపేందుకు అలాగే దాని మూలకారణాలు గుర్తించి, పరిష్కరించేందుకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. వాతావరణ మార్పులపై నమ్మకం లేనివాళ్లకి ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కుతాయని నేను అనుకోవడం లేదని'' అన్నారు. 

Also Read: ఈ రంగాల వారికి బిగ్ షాక్.. హెచ్‌-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు.. ఇక వెళ్లడం కష్టమే!

ఇక ట్రంప్ పేరు మీద నోబెల్ శాంతి బహుమతి కోసం వచ్చిన నామినేషన్లన్నీ కూడా గడువు తేదీ ముగిసిన తర్వాతే వచ్చాయని మరికొందరు చెబుతున్నారు. జనవరి 31కే గుడువు ముగిసిందని.. ఆ తేదీ తర్వాత నామినేషన్లు వచ్చినట్లు అంటున్నారు. అయితే ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి మిస్‌ అయినప్పటికీ మళ్లీ 2026లో మరోసారి పోటీ పడే అవకాశం ఉంటుంది.

Also Read: పాక్‌కు బిగ్ షాక్.. పెరుగుతున్న భారత్‌-అఫ్గానిస్థాన్‌ స్నేహం..

Advertisment
తాజా కథనాలు