India-Afghanistan: పాక్‌కు బిగ్ షాక్.. పెరుగుతున్న భారత్‌-అఫ్గానిస్థాన్‌ స్నేహం..

తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్థాన్‌ను ఇప్పటికీ భారత్‌ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ అఫ్గాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌-తాలిబన్‌ మధ్య సంబంధాలు మెరుగుపడనున్నట్లు తెలుస్తోంది.

New Update
Why india increasing engagement with Afghanistan’s Taliban

Why india increasing engagement with Afghanistan’s Taliban

అఫ్గానిస్థాన్(afghanistan) విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 9 నుంచి 16వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం అమిర్‌ ఖాన్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో భేటీ కానున్నారు. అయితే అఫ్గాన్ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో కాబుల్‌లో భారీ పేలుళ్లు జరగడం కలకలం రేపింది. తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (TTP) చీఫ్‌ నూర్ వాలి మెహ్సూద్‌ స్థావరమే టార్గెట్‌గా పాక్‌ ఫైటర్‌ జెట్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థుతులు కొనసాగుతున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ భారత్‌కు దగ్గరవుతోంది. 

Also Read: భారత్‌లో 9 యూకే యూనివర్శిటీల క్యాంపస్‌ల ఏర్పాటు..ప్రధాని మోదీ

India Increasing Engagement With Afghanistan’s Taliban

తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్థాన్‌ను ఇప్పటికీ భారత్‌ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ అఫ్గాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకుముందు అఫ్గాన్-భారత్‌కు మధ్య సంబంధాలు ఉండేవి కావు. తాలిబన్లకు భారత్‌ పూర్తిగా వ్యతిరేకం. తాలిబన్‌ ప్రభుత్వాన్ని ఇప్పటిదాకా రష్యా మాత్రమే అధికారికంగా గుర్తించింది. భారత్‌ మాత్రం దాన్ని గుర్తించేందుకు నిరాకరించింది. తాలిబన్ల ప్రభావం ఉన్న అఫ్గాన్‌లో ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ అఫ్గాన్ మంత్రి భారత పర్యటన వేళ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. 

ప్రస్తుతం చూసుకుంటే తాలిబన్‌ ప్రభుత్వం భారత్  వ్యతిరేక ఉగ్ర గ్రూపులకు బహిరంగంగా ఆశ్రయం కల్పించడం లేదు. అఫ్గానిస్థాన్‌-పాక్‌ సంబంధాలు దెబ్బతినడంతో జైషే మహమ్మద్, లష్కరే తయిబా వంటి సంస్థలు కూడా అఫ్గాన్‌లో పరిమిత కార్యకలాపాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబన్లతో చైనా సంబంధాలు పెంచుకుంటోంది. దీంతో అఫ్గానిస్థాన్‌ చైనాకు లోబడి ఉండకుండా ఉండేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌షాక్‌ ... ఈ సారి నోబెల్ ప్రైజ్ ఎవరికంటే?

ఒకప్పుడు పాకిస్థాన్‌ తాలిబాన్‌కు మిత్రదేశంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న తాలిబాన్‌ ప్రభుత్వంలో సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనికి ముఖ్య కారణం తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కి అఫ్గానిస్థాన్‌కు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. తాలిబన్లు అధికారకంలోకి రాకముందు భారత్‌.. అఫ్గానిస్థాన్‌లోని మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో, అలాగే డ్యామ్‌లు, పార్లమెంట్ భవనం కోసం 3 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. 

మరోవైపు ఇప్పటిదాకా తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అధికారికంగా ఇంకా గుర్తించలేదు. కేవలం రష్యా మాత్రమే ఇటీవల గుర్తించింది. దీంతో భారత్ లాంటి దేశంతో సంబంధాలు పెంచుకుంటే.. తమ పాలనకు అంతర్జాతీయ వేదికపై చట్టబద్ధత లభిస్తుందని తాలిబాన్ భావిస్తోంది. మరోవైపు అఫ్గాన్‌లో చైనా ప్రభావం పెరుగుతున్న క్రమంలో భారత్‌ కూడా ఆ ప్రాంతంలో తమ ఉనికిని స్థాపించుకోవాలని చూస్తోంది. చైనా లేదా పాకిస్థాన్‌కు అఫ్గాన్‌ ప్రాంతంపై పూర్తిగా పట్టు ఉండకుండా చూడాలని యోచిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన సంగతి తెలిసిందే. అఫ్గాన్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ.. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లు భారత్‌ కూడా అఫ్గానిస్థాన్‌తో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు