North Korea: మా జోలికి వస్తే...అమెరికాకు కిమ్‌ సోదరి వార్నింగ్‌!

అమెరికా,దాని మిత్ర దేశాలకు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపారు.

New Update
kim joyong

kim joyong

అమెరికా,దాని మిత్ర దేశాలకు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా -అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీప కల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది.

Also Read: China-Trump: చైనా పై ట్రంప్‌ డబుల్‌ షాక్‌.. వాటిని పెంచేసిన అగ్రరాజ్యం!

North Korea Slams United States

దక్షిణ కొరియా యూఎస్‌ సైనిక విన్యాసాలను తమ పై దాడికి సన్నాహంగా కిమ్‌ ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్‌ పోర్ట్‌ లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్‌ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.

అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తర కొరియా పై రాజకీయంగా , సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గతప్రభుత్వ శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకుని వెళ్తుంది అని జోంగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య ఘర్షణాత్మక ఉన్మాదానికి ప్రతీక అని, ధీటుగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.

Also Read: Ayodhya Ram mandir: అయోధ్య రామ మందిరం పై దాడికి పాకిస్థాన్ ఉగ్ర కుట్ర

ఆదివారం ఈ విమాన వాహక నౌక బుసాన్‌ తీరానికి రాగా..గత నెల ఈ రేవులో అమెరికా అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపింది. దీనిని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. ఘర్షణ కోసం అమెరికా బలమైన ఉన్మాదానికి ఇది అద్దం పడుతోంది.వాషింగ్టన్‌ ప్రమాదకర కవ్వింపు చర్యలతో మేము ఆందోళన చెందుతున్నాం.ఇది కొరియా ద్వీపకల్పం చుట్టుపక్కల తీవ్రమైన సైనిక ఘర్షణకు దారి తీయోచ్చు.


కవ్వించేవారి పై చర్యలు తీసుకునే మా చట్టబద్దమైన హక్కును కచ్చితంగా వాడుకుంటాం అని ఉత్తర కొరియా రక్షణ శాఖ ఈ ప్రకటనలో పేర్కొంది. అమెరికా గుడ్డిగా తన బలాన్ని నమ్ముకొంటోందని వ్యాఖ్యానించింది.

Also Read: America-Iran: పెద్దన్న దెబ్బకు పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. ఒక డాలరుకు ఎన్ని లక్షల రియాల్స్‌ అంటే!

Also Read: Hyderabad: నగర వాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌ న్యూస్‌... ఇక పై వాటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు