/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
సుంకాల విషయంలో చైనా (China) కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) గట్టి షాకిచ్చారు. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తుల పై 10 శాతం సుంకాలు విధించగా.. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచారు.ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుల పై ఆయన సంతకం చేశారు. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షుడు తెలిపారు. అందుకే ఆ దేశం పై టారిఫ్ లను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరో వైపు కెనడా,మెక్సికో దిగుమతుల పై 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ వెల్లడించారు.మార్చి 4 నుంచి అవి యథావిధిగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.ట్రంప్ అధికారంలోకి రాగానే..మిత్ర దేశాలైన మెక్సికో,కెనడాలతో పాటు చైనా పైనా సుంకాల కొరడా అదిలిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Ap Assembly 2025: ఇంగ్లీష్ వద్దమ్మా.. తెలుగులోనే మాట్లాడండి.. రఘురామ సలహా!
Trump Raises Tariffs On Chinese Goods
ఫిబ్రవరి 4 వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయని గతంలో ప్రకటించారు.ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ ,కెనడా ప్రధాని ట్రూడో అమెరికా అధ్యక్షుడితో ఫోన్ లో చర్చలు జరిపారు. సరిహద్దు భద్రతకు సైనాన్ని మోహరిస్తామని, వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్,ఫెంటనిల్ పై పోరాటానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దీంతో సుంకాల అమలును నెల రోజుల పాటు వాయిదా వేసుందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు.
ఆ గడువు నేటితో ముగియడంతో మెక్సికో, కెనడా పై సుంకాలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఇక ఆ దేశాలకు ఎలాంటి అవకాశాలు మిగిలి లేవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అయితే చైనా పై మాత్రం గత నెల నుంచే సుంకాలు అమల్లోకి రాగా..తాజాగా వాటిని రెట్టింపు చేశారు.
Also Read:Ayodhya Ram mandir: అయోధ్య రామ మందిరం పై దాడికి పాకిస్థాన్ ఉగ్ర కుట్ర
కెనడా నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తుల పై 25 శాతం చమురు, సహజవాయువు, విద్యుత్తు పై మాత్రం 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.దీనికి ప్రతిగా ట్రూడో కూడా అగ్రరాజ్యం పై సుంకాలు విధించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్,పండ్లు సహా 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల పై తాము కూడా 25 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా మంగళవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. సోమవారం నాటి ట్రేడింగ్ లో సూచీలు పతనమయ్యాయి. డోజోన్స్ 1.48 శాతం,ఎస్‌అండ్ పీ సూచీ 1.76 శాతం, నాస్‌డాక్ 2.64 శాతం కుంగాయి. ఈ ప్రభావం ఆసియా-పసిఫిక్ , ఆస్ట్రేలియా మార్కెట్ల పైనా పడింది. టోక్యో,హాంకాంగ్, సిడ్నీ సూచీలు నష్టాలతోట్రేడ్ అవుతోంది.జపాన్ నిక్కీ 2.43 శాతం మేర నష్టాల్లో ఉంది.