Hyderabad: నగర వాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌ న్యూస్‌... ఇక పై వాటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు!

హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు మెట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే.నగరంలోని మొత్తం 57 స్టేషన్లలో రోడ్డు దాటేందుకు ప్రజలకు అనుమతి ఉందని అధికారులు సూచించారు.

New Update
Old City Metro Rail

Old City Metro Rail

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రెప్పపాటు కాలంలోనే వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతుంటాయి. కాలి నడకన వెళ్లేవారు రోడ్డుకు ఓ పక్క నుంచి మరోవైపునకు దాటాలంటే ప్రమాదంతో కూడిన పెద్ద సాహసాలే చేయాలి. కొన్ని ఏరియాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నప్పటికీ.. మరికొన్ని చోట్ల మాత్రం అవి లేకపోవడంతో ప్రమాదకరంగా రోడ్డు దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి.ఇలాంటి సమయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. రోడ్డు ప్రమాదాల (Road Accidents) బారిన పడినట్లే. ఇలా చాలా మంది యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Harassment: మాజీ సీఎం కుమార్తెకు వేధింపులు.. చెప్పుతో కొట్టి.. వీడియో వైరల్ !

Hyderabad Metro

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) అధికారులు కీలక ప్రకటన చేశారు. మెట్రో స్టేషన్‌ నుంచి రోడ్డుకు ఒకవైపు నుంచి మరోవైపునకు చేరుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. కేవలం మెట్రో ప్రయాణికులే కాకుండా ఎవరైనా రోడ్డు దాటేందుకు దాన్ని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్టు సౌకర్యం కూడా ఉంటుందని ఇబ్బందులు పడకుండా రోడ్డు దాటవచ్చునని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లలోని మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ప్రతి స్టేషన్‌‌లోనూ రోడ్డు దాటేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక మెట్రో స్టేషన్ల నుంచి వాటి సమీపంలోని వాణిజ్య భవనాలు, నివాస సముదాయాలకు స్కైవాక్‌‌కు నిర్మించుకునేందుకు కూడా అనుమతి ఉందని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు.

Also Read:Shama Mohamed: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ  షామా మొహమ్మద్?

ప్రస్తుతం పంజాగుట్ట, హైటెక్‌సిటీ, ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని మాల్స్‌కు ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ స్కైవాక్‌లను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. జేబీఎస్, పరేడ్‌ గ్రౌండ్స్‌ స్టేషన్లను కలుపుతూ రహదారి దాటే అవసరం లేకుండా స్కైవాక్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సికింద్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి రేతిఫైల్‌ బస్టాండ్, రైల్వే స్టేషన్‌‌కు ఈజీగా చేరుకునేలా స్కైవాక్‌ ఉందన్నారు. ఇక ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే వాసవీ ఆనంద నిలయం పేరుతో భారీ గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మిస్తున్నారని మెట్రో అధికారులు తెలిపారు. తమ గేటెడ్ కమ్యూనిటికీ మెట్రో స్టేషన్‌ నుంచి స్కైవాక్ నిర్మాణానికి ముందుకొచ్చిందన్నారు.

Also Read: America-Iran: పెద్దన్న దెబ్బకు పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. ఒక డాలరుకు ఎన్ని లక్షల రియాల్స్‌ అంటే!

Also Read: Ap Assembly: ఇంగ్లీష్ వద్దమ్మా.. తెలుగులోనే మాట్లాడండి.. రఘురామ సలహా!

Advertisment
తాజా కథనాలు