Trump-Zelensky Meet: పుతిన్ సమావేశానికి హాడావుడి..నీరసంగా జెలెన్ స్కీ భేటీ.. ట్రంప్ తీరు

అసలు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు, ఎందుకు , ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. దానికి ఉదాహరణే పుతిన్, జెలెన్ స్కీలతో భేటీ. పుతిన్ కు రెడ్ కార్పెట్, బీ2 బాంబర్లతో స్వాగతం పలికి హడావుడి చేసిన ట్రంప్ జెలెన్ స్కీ తో సమావేశాన్ని మాత్రం సాదాసీదాగా జరిపించేశారు.

New Update
meets

Trump-Zelensky meet

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, శాంతి చర్చలు...గత నాలుగు రోజులుగా ప్రపంచం అంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelenskyy) తో సమావేశమయ్యారు. రెండు దేశాధినేతలతోనూ యుద్ధ విరమణ దిశగా చర్చలు జరిపారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం దిశగా పుతిన్, జెలెన్ స్కీలను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు ఇవి రెండూ సానుకూలంగానే నడిచాయి కూడా.  అయితే రెండు సమావేశాలకూ తేడాలు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఒకలా...ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మరోలా ప్రవర్తించడమే దీనికి కారణం. 

రెడ్ కార్పెట్, బీ2 బాంబర్లు..

 రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) కు ట్రంప్ తమ బలుపును చూపెట్టారు. సమావేశానికి స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలను వెంట పెట్టుకుని వెళ్ళారు. పుతిన్ ను ఆహ్వానిస్తున్నప్పుడు అమెరికా శక్తిని ఏంటో చూపించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం భేటీ అయినప్పటికీ...రష్యాకు తమ బలమేంటో చూపించాలనుకున్నారు ట్రంప్. దానికి తగ్గట్టే ప్రిపేర్ అయి వెళ్ళారు. తమ అమ్ముల పొదిలో ఉన్న ఆయుధాల ప్రదర్శన చేశారు. వ్లాదిమిర్ పుతిన్ యాంకరేజ్ నగరంలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ వద్ద తన విమానం నుండి దిగి పుతిన్ ను.. ట్రంప్‌ కలుస్తున్నప్పుడు, B-2 స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్‌లు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. తరువాత సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గల్లో చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసింది. 

Also Read :  ట్రంప్, జెలెన్‌స్కీ భేటీకి ముందు ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఏడుగురు మృతి

నీరసంగా జెలెన్ స్కీ భేటీ..

రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి అంత హడావుడి చేసిన ట్రంప్(Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమావేశాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు. జెలెన్ తో పాటూ యూరోపియన్ నేతలు కూడా ఈ రోజు భేటీకి హాజరయ్యారు. అయినా కూడా అమెరికా అధ్యక్షుడు ఆ వచ్చారు లే అన్నట్టు ప్రవర్తించారు. పుతిన్ కు ఇచ్చిన గౌరవం ఎవరికీ ఇవ్వలేదు. చాలా సాధారణంగా వైట్ హౌస్ కు అందరూ వచ్చినట్టే వచ్చారన్నట్టు ప్రవర్తించారు. 

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అయ్యాక ఆయన జెలెన్ స్కీని కలవడం ఇది రెండో సారి. ఇంతకు ముందు ఆరు నెలల క్రితం ఫిబ్రవరిలో జెలెన్ వైట్ హౌస్ కు ఒకసారి వచ్చారు. అప్పుడు ట్రంప్ ఆయనతో గొడవ పడ్డారు. అంతేకాదు జెలెన్ ను ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించారు కూడా. మొదటిసారి అమెరికా అధ్యక్షుడిని కలవడానికి వచ్చినప్పుడు జెలెన్ సింపుల్ గా టీ షర్ట్ వేసుకుని వచ్చారు. దీనిపై కూడా యూఎస్ అధినేతలు మండిపడ్డారు. అప్పుడు సమావేశంలో ట్రంప్ అరవడం, జెలెన్ కోపంతో మధ్యలోనే వెళ్ళిపోవడం లాంటివి జరిగాయి. ఇప్పుడు మళ్ళీ పుతిన్ తో సమావేశం తర్వాత జెలెన్ వైట్ హౌస్ కు వచ్చారు. అయితే ఈసారి అన్ని మర్యాదలనూ పాటిస్తూ మంచి బ్లేజర్ కోట్ వేసుకునే సమావేశానికి హాజరయ్యారు. కానీ ట్రంప్, మిగతా నేతల నుంచి మాత్రం పెద్దగా స్పందన ఏమీ రాలేదు. 

పుతిన్ తో అవసరం..

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ట్రంప్ మొదటిసారి కలిశారు. దాంతోపాటూ ఒక రష్యా అధ్యక్షుడు అమెరికా రావడం కూడా చాలా ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి. అందునా ప్రస్తుతం పుతిన్ ప్రపంచ నేతలలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. ఈయనను యుద్ధ విరమణకు ఒప్పించడం అమెరికాకే కాదు యూరోపియన్, భారత్ వంటి దేశాలకు కూడా ఎంతో అవసరం. అదీ కాక రష్యాతో వ్యాపారాన్ని విస్తృతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. దానికి పుతిన్ ను మంచి చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే టప్రంప్ ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. బీ2 బాంబర్లతో కాస్త బలుపును ప్రదర్శించినప్పటికీ అది పుతిన్ కు గౌరవంగానే మారిపోయింది. తరువాత సమావేశంలో కూడా ఆయన మాటే చెల్లేలా చేశారు ట్రంప్. పుతిన్ చెప్పిన వాటన్నింటికీ తలూపారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ తో ట్రంప్ కు ఈ పరిస్థితి లేదు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఈ సమావేశం వైట్ హౌస్ లోనే జరిగింది. ఇక్కడ అంతలా పెద్ద ఏర్పాట్లను చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇవన్నీ కారణాలతో జెలెన్ స్కీ సమావేశం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. 

Also Read:ZelenSky: త్రైపాక్షిక సమావేశానికి నేను సిద్ధం..జెలెన్ స్కీ

Advertisment
తాజా కథనాలు