Rashmika Mandanna-Rakshit Shetty Breakup: రక్షిత్ శెట్టితో రష్మికకు ఎందుకు బ్రేకప్ అయ్యిందో తెలుసా?

రష్మిక మందన, రక్షిత్ శెట్టికి గతంలో ఎంగేజ్‌మెంట్ జరగ్గా ఏడాదికే విడిపోయారు. అయితే పెళ్లి తర్వాత రక్షిత్ శెట్టి సినిమాలు చేయవద్దని రూల్ పెట్టారని అందుకే బ్రేకప్ అయినట్లు అప్పట్లో వార్తలు సంచలనం సృష్టించాయి.

New Update
Rashmika Mandanna

Rashmika Mandanna-Rakshit Shetty Breakup

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో రష్మికకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. ఏడాది తర్వాాత వారికి బ్రేకప్ అయ్యింది. అయితే రష్మికు విజయ్‌తో ఎంగేజ్‌మెంట్ జరగడంతో.. ఎందుకు రక్షిత్ శెట్టి తో బ్రేకప్(Rakshit Shetty Breakup) అయ్యిందని తెలుసుకోవాలని నెటిజన్లు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్దరు విడిపోవడానికి గల కారణాన్ని రష్మిక తల్లి సుమన్ మందన్న గతంలో కారణం తెలిపారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు..రష్మిక, విజయ్ ఎంగేజ్ మెంట్

కారణాలు ఇవే..

రష్మికకు వచ్చిన క్రేజ్ ప్రకారం రక్షిత్ శెట్టి ఆమెకు ఒక మేనేజర్‌ను నియమించాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో రష్మిక అతన్ని తొలగించగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కలిసి ఈ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసినట్లు ఆమె గతంలో తెలిపారు. ఇవే కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రష్మిక కంటే రక్షిత్ శెట్టి 13 ఏళ్ల పెద్ద. ఈ కారణం వల్ల ఇద్దరి మధ్య గొడవలు రావడంతో మ్యూచువల్‌గా విడిపోయినట్లు సమాచారం. అయితే భవిష్యత్తులో సినిమాలు చేయకూడదని రక్షిత్ శెట్టి రష్మికకు కండీషన్ పెట్టాడని, దానికి ఆమె నిరాకరించడంతో బ్రేకప్ అయ్యిందని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Shoaib Malik Sana Javed Divorce: సానియా మాజీ భర్త మాలిక్ మూడో భార్యకు విడాకులు

రష్మిక మందన్న కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళం, కన్నడ, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోల సరసన నటించారు. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశం లభించింది. ఆ తర్వాత పుష్ప 2, యానిమల్, చావా వంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా రష్మిక చేస్తోంది. వరుస సినిమా ఆఫర్లతో రష్మిక బిజీగా ఉంటోంది. 

Advertisment
తాజా కథనాలు