PM KP Sharma Oli: నేపాల్ ప్రధాని రాజీనామా!

నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.పీఎం కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. సాయంత్రం కొత్త ప్రధానిగా ఎన్నుకునే అవకాశం ఉంది. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లుగా  కేపీ శర్మ తర రాజీనామా ప్రకటనలో వెల్లడించారు. 

New Update
nepal

నేపాల్ రాజకీయాల్లో(Nepal Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పీఎం కేపీ శర్మ ఓలి(kp-sharma-oli) తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం కొత్త ప్రధానిగా ఎన్నుకునే అవకాశం ఉంది. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లుగా  కేపీ శర్మ తర రాజీనామా ప్రకటనలో వెల్లడించారు. వందలాది మంది ప్రదర్శనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తన కార్యాలయంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఓలి పదవి నుంచి తప్పుకున్నారు.

 ప్రభుత్వం ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, వాట్సాప్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ నేపాల్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.  నిరసనలు హింసాత్మకంగా మారడంతో, నిరసనకారులు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. పార్లమెంటు భవనాన్ని ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు. ఈ ఘటనల్లో దాదాపు 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. 

Also Read :  నేపాల్‌లో మంత్రుల ఇళ్లకు నిప్పు.. దుబాయ్‌కి పారిపోతున్న ప్రధాని ?

పరిస్థితి చేయి దాటిపోవడంతో

పరిస్థితి చేయి దాటిపోవడంతో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ ప్రధాని ఓలీని రాజీనామా(resign) చేయమని సూచించినట్లు సమాచారం. దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రధాని రాజీనామా చేయడమే ఏకైక మార్గమని సైన్యం తెలిపినట్లు తెలుస్తోంది. సైన్యం సూచన మేరకు ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు తాను రాజీనామా చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

ఓలీ రాజీనామాకు ముందు హోంమంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని ఓలీ దేశం విడిచి దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని, వైద్య చికిత్స పేరుతో ఆయన దుబాయ్ వెళ్లేందుకు ప్రైవేటు ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. 

Also Read :  పరువునష్టం కేసులో ట్రంప్‌కు బిగ్‌ షాక్.. రూ.733 కోట్లు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు