France: మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పే..ఫ్రాన్స్‌ ప్రధాని!

ప్రపంచ నేతలతో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ బేరో మస్క్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు.

New Update
french

french

ప్రపంచ నేతలతో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ బేరో మస్క్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌ ప్రజాస్వామ్యానికి ముప్పు సృష్టిస్తున్నాడు.

Also Read: 

మనస్సాక్షిని పాలించే హక్కు డబ్బుకు ఇవ్వకూడదు అని బేరో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.మస్క్‌ ఇటీవల ఫ్రాన్స్‌, యూరప్‌ లను ఉద్దేశిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలకు ఆయా దేశాలు దాసోహం కావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కుదరని పక్షంలో ఆధిపత్యం, అణచివేత, అట్టడుగు స్థాయిని ఎదుర్కోవాల్సి వస్తోందంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రధాని తాజాగా స్పందించారు.

Also Read: Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

కొన్ని నెలల నుంచి మస్క్‌ కు, ప్రపంచ నేతలకు మధ్య వివాదాలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌  షోల్జ్‌ , కెనడా ప్రధాని ట్రూడో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వంటి వారితో మాటల యుద్ధాలకు దిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మస్క్‌ బ్రిటన్‌ రాజకీయాల గురించి ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు.

Also Read: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..విపక్షం రీఫామ్‌ యూకేకు మద్దతు తెలుపుతున్నారు.మరోవైపు తమ దేశ ఎన్నికల్లో టెస్లా అధినేత నేరుగా జోక్యం చేసుకొంటున్నాడని ఫ్రాన్స్‌ అధినేత మెక్రాన్‌,కెనడా ప్రధాని ట్రూడో, యూకే పీఎం స్టార్మర్‌ , నార్వే ప్రధాని జోనాస్‌ ఆరోపించారు.

అంతేకాక..యూకేలోని గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ అరాచకాలపై సైతం వరుస ప్రకటనలు చేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ హోదాలో ఉన్నవేళ స్టార్మర్‌ వాటిని అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ ఆరోపణలను యూకే పీఎం స్టార్మర్‌ తిరస్కరించారు. మస్క్‌పేరు ప్రస్తావించకుండా..అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు.

అత్యాచారాలకు గురైన చిన్నారులకు న్యాయం చేయడానికి తాము ఎప్పుడు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.

Also Read: California Wild Fire: కాలిఫోర్నియా వాసులకు ఓ గుడ్ న్యూస్.. మరో షాకింగ్ న్యూస్..!

Also Read: Telangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు