Navrro VS Elon Musk: నవారోకు బిగ్‌ షాక్‌.. కౌంటర్ ఇచ్చిన ఎలాన్‌మస్క్

ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో భారత్‌లో కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయనకో బిగ్ షాక్ తగిలింది. నవారో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధమని ఎక్స్‌ 'ఫ్యాక్ట్‌చెక్‌' వెల్లడించింది.  

New Update
Navrro VS Elon Musk

Navrro VS Elon Musk

ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో భారత్‌లో కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయనకో బిగ్ షాక్ తగిలింది. నవారో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధమని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ 'ఫ్యాక్ట్‌చెక్‌' వెల్లడించింది.  ఈ వ్యవహారంపై ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా స్పందించారు. ఎవరు తప్పు చేసినా కూడా ఎక్స్‌ కమ్యూనిటీ నోట్స్‌ దాన్ని సరిచేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని తేల్చిచెప్పారు. గ్రోక్‌ మరింత ఫ్యాక్ట్‌చెక్‌ సమాచారాన్ని ప్రజలు అందిస్తోందని చెప్పారు.   

Also Read: ఎంపీ సోదరికి అత్తింటివారి వేధింపులు.. నడిరోడ్డుపై కర్రతో కొట్టిన మామ.. వీడియో వైరల్

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల నవారో ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. '' భారత్‌ విధిస్తున్న సుంకాల ప్రభావం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. తమ లాభం కోసమే రష్యా నుంచి ఆయిల్‌ను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోందని'' నవారో పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టును ఎక్స్‌ ఫ్యాక్ట్ చేసింది. నవారో చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేసింది. భారత్‌ తమ ఇందన భద్రత కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని చెప్పింది. 

Also Read: ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఐటీ..కాపాడుకుంటామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

భారత్‌ ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించలేదని తేల్చిచెప్పింది. అంతేకాదు అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటోందని పేర్కొంది. నవారో చేసిన వ్యాఖ్యలు కపటమైనవిగా ఉన్నాయని పేర్కొంది. దీనిపై స్పందించిన నవారో ఎక్స్‌పై విరుచుకుపడ్డారు. ఎలాన్‌మస్క్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌ ఫ్యాక్ట్‌చెక్‌ ఇచ్చిన సమాచారాన్ని ఒక చెత్త అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Also Read: వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో అనుపర్ణ రాయ్‌ సరికొత్త రికార్డ్

ఇదిలాఉండగా భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చాలామంది అమెరికా రాజకీయ విశ్లేషకులు సైతం భారత్‌పై అధికంగా టారిఫ్‌లు విధించడాన్ని తప్పుబట్టారు. మరోవైపు పీటర్‌ నవారో, బెసెంట్ లాంటి వారైతే భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల పలు వర్గాలను టార్గెట్‌ చేసి నవారో చేసిన వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది. 

Also Read: జమ్మూ కశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

#international #india #trump #rtv-news #telugu-news
Advertisment
తాజా కథనాలు