ఎంపీ సోదరికి అత్తింటివారి వేధింపులు.. నడిరోడ్డుపై కర్రతో కొట్టిన మామ.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఓ బీజేపీ ఎంపీ సోదరికే తన అత్తమామల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. వాళ్ల అకృత్యాల గురించి నిలదీసినందకు కోపంతో రగిలిపోయిన మామ.. ఆమెను వీధిలోకి లాగి కొట్టారు.

New Update
Bjp mp mukesh rajput sister reena  singh Assaulted By In-Laws

Bjp mp mukesh rajput sister reena singh Assaulted By In-Laws


వివాహం తర్వాత కొందరు మహిళలు అత్తింటివారి వేధింపులకు గురవుతుంటారు. ముఖ్యంగా అదనపు కట్నం కోసమే ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఓ బీజేపీ ఎంపీ సోదరికే తన అత్తమామల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. వాళ్ల అకృత్యాల గురించి నిలదీసినందకు కోపంతో రగిలిపోయిన మామ.. ఆమెను వీధిలోకి లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  

Also Read: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై BRS కీలక నిర్ణయం.. నోటా లేకపోవడంతో..

ఇక వివరాల్లోకి వెళ్తే ఫరూఖాబాద్‌ నియోజకవర్గం ఎంపీ ముకేశ్‌ రాజ్‌పుత్‌ సోదరి పేరు రీనా సింగ్. ఈమెకు17 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటా అనే జిల్లాలో వీళ్లు నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. రీనాసింగ్‌ను తన మామ లక్ష్మణ్‌సింగ్, తన భర్త సోదరులు కలిసి నడి వీధిలోనే దారుణంగా కర్రలతో చితకబాదారు. ఆమె కొట్టొద్దని ఎంత వారించినా వాళ్లు దాడికి పాల్పడ్డారు. చివరికి ఈ ఘటనపై రీనా సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: జమ్మూ కశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

పోలీసుల ఫిర్యాదులో రీనా సింగ్‌ కీలక విషయాలు వెల్లడించారు. తన అత్తింటివారు కొన్నేళ్ల నుంచి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. '' ఆదివారం మధ్యాహ్నం నేను స్నానం చేస్తున్నాను. ఆ సమయంలో మామ, మరిది కలిసి బాత్‌రూమ్ కిటికీ నుంచి ఫోన్‌లో వీడియో తీసేందుకు యత్నించారు. నాపై అసభ్యంగా ప్రవర్తించారు. నేను వాళ్లని ప్రశ్నించడంతో నాపై దాడికి దిగారు. నా కూతురుని కూడా కొట్టారు. చాలారోజుల నుంచి నన్ను వేధిస్తున్నారని'' రీనా సింగ్ పోలీసులకు తెలిపారు. ఆమె బీజేపీ ఎంపీ ముకేశ్‌ రాజ్‌పుత్‌ సోదరి కావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: దేశంలోని ఆలయాలన్నీ క్లోజ్‌..కానీ ఆ రెండు మాత్రం ఓపెన్‌..ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు